Coolie Shruti Haasan: ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం కూలీ (Coolie ). ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా.. ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna ) విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra), బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
కూలీ సినిమాలో తన రీల్ క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి తోడు సినిమాపై హైప్ పెంచడానికి చిత్ర బృందం చేస్తున్న ప్రయత్నాలు కూడా భారీగానే వర్క్ అవుట్ అవుతున్నాయి.. ఇప్పుడు తన వంతు ప్రయత్నంగా శృతిహాసన్ కూడా తన పాత్ర గురించి చెప్పి అంచనాలు పెంచేసింది. కూలీ సినిమాలో శృతిహాసన్ ప్రీతి అనే పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పాత్ర పై నోరు విప్పింది. “ప్రీతి నాలాంటి అమ్మాయి అని మాత్రం నేను చెప్పను. కానీ ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది మహిళలు ఈ పాత్రకు కనెక్ట్ అవుతారు. ప్రీతి ఎంతో బాధ్యత కలిగిన అమ్మాయి. ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుంది.” అంటూ తన రీల్ క్యారెక్టర్ పై క్లారిటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు నిజ జీవిత పాత్రకు ఇది పూర్తి వ్యతిరేకం అంటూ శృతిహాసన్ చెప్పడంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందో తెరపై చూడడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు ఆడియన్స్.
శృతిహాసన్ కెరియర్..
శృతిహాసన్ విషయానికి వస్తే.. కమలహాసన్(Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ మొదట్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించలేక ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. ఇక హీరోయిన్ గా మెప్పించ లేకపోయినా.. సింగర్ గా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా ద్వారా తన ఉనికిని చాటుకుంది. అప్పటినుంచి ఈమె చేసిన ప్రతిపాత్ర కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ (Prabhas ) తో సలార్ (Salaar) సినిమా చేశాక పాన్ ఇండియా స్టార్ అయిపోయిన శృతిహాసన్.. ఇప్పుడు వరుస పెట్టి స్టార్ హీరోలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే శృతిహాసన్ ఇప్పుడు కూలీ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా శృతిహాసన్ కి ఎలాంటి ఇమేజ్ అందిస్తుందో చూడాలి.
ALSO READ:Anupama Parameswaran: బ్రిడ్జిపై నుండి పడిపోయిన అనుపమ.. అసలేం జరిగిందంటే?