E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్‌ను ఢీ కొన్న బస్‌.. స్పాట్‌లో 40 మంది

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్‌ను ఢీ కొన్న బస్‌.. స్పాట్‌లో 40 మంది
Advertisement

Road Accident: రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఎంత చెప్పిన ఈ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.. నేడు మళ్లీ మరో ట్రావెల్ బస్సు ప్రమాదం..  మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ ప్రాంతంలో ఈ రోజ ఉదయం 07:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన జడ్చర్ల మండలం నాచారం వంతెన వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అవుతూ పొగలు వెలువడటం ప్రారంభమైంది. ఈ పొగలు విషపు గ్యాస్‌లా వ్యాప్తి చెందుతుండటంతో పరిసర ప్రాంతంలో భయబ్రాంతులు చెలరేగాయి. మంటలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలు అందరు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Also Read: రూటు మార్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఎప్పటినుంచంటే..!

సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను బస్సు నుంచి సురక్షితంగా దించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, పర్యావరణ శాఖ అధికారులు యాసిడ్ లీక్‌ను అదుపు చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేశారు. యాసిడ్‌ను శుభ్రం చేసి, ట్యాంకర్‌ను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో రహదారి రెండు వైపులా ట్రాఫిక్ స్తంభించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు డైవర్షన్‌లు ఏర్పాటు చేసి, ప్రయాణికులకు మార్గదర్శకత్వం వహించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×