BigTV English

Mars Rocks : 54 కోట్ల ఏళ్ల నాటి అంగారక శిల

Mars Rocks : 54 కోట్ల ఏళ్ల నాటి అంగారక శిల
Mars Rocks

Mars Rocks : భూమిపైకి అంతరిక్ష శిలలు దూసుకొస్తుంటాయి. మన పొరుగునే ఉన్న అంగారక గ్రహం నుంచి రాలి పడిన ఉల్కలూ వాటిలో ఉన్నాయి. అలా 360 వరకు అరుణ గ్రహం నుంచి భూగోళానికి చేరాయి. వీటి వయసు ఎంతనేది నిర్థారించడం ఎంతో సంక్లిష్టం. అయితే అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిలో ఈ చిక్కుముడిని విప్పారు.


వాస్తవానికి ఆ శిలలు ఇటీవలి కాలానివేనని.. అంటే వందల మిలియన్ల సంవత్సరాల నాటివేనని తేలడం వారిని విస్మయపరిచింది. దీనిని బట్టి అంగారక శిలలు భూమిపైకి చేరడానికి పట్టిన సమయం, ఆ గ్రహం జియెలాజికల్ ప్రక్రియ గురించి తాజా సమాచారం ద్వారా ఓ అవగాహనకు రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని శిలల రసాయనిక లక్షణాలను బట్టి అవి కచ్చితంగా అంగారక శిలలేనని చెప్పొచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన వోల్కనాలజిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్త బెన్ కోహెన్ స్పష్టం చేశారు. అంగాకర గ్రహాన్ని భారీ ఆస్టరాయిడ్ల వంటివి ఢీకొన్నట్టు.. దాని ఉపరితలంపై వేల సంఖ్యలో ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల ద్వారా స్పష్టమవుతోంది. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని శిలలు ఎగసి.. సౌరవ్యవస్థ ద్వారా ప్రయాణించి భూమిపై పడినట్టు చెబుతున్నారు.


అయితే రాలి పడిన ఉల్కలు అంగారకుడివా? లేక వేరొక గ్రహానివా? అన్న విషయంలో మీమాంస ఉండేది. ఆ శిలల వయసును లెక్కించడం ద్వారా అవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది తెలుసుకునే వీలుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు సేకరించిన మార్టియన్ శిలల్లో 302 వరకు షెర్‌గాటైట్ రకానికి చెందినవే. ఈ రకం శిలల్లో లోహధాతువులు అధికం. మార్స్‌పై అగ్నిపర్వత పేలుళ్ల ప్రక్రియ కారణంగా ఏర్పడిన శిలలను షెర్‌గాటైట్ రకంగా వర్గీకరించారు.

అరుణగ్రహంపై క్రేటర్లను బట్టి చూస్తే.. ఈ శిలలు చాలా పురాతనమైనవనే భావన ఉండేది. కానీ ఆగాన్-ఆగాన్ డేటింగ్‌ సాయంతో వాటి వయసు చాలా తక్కువేనన్న నిర్థారణకు వచ్చారు. రిసెర్చికి ఉద్దేశించిన ఓ న్యూక్లియర్ రియాక్టర్‌లో అంగారక శిలలకు చెందిన ఏడు చిన్న చిన్న శాంపిళ్లను ఉంచారు. తద్వారా ఆ శాంపిళ్లలో ఆగాన్ రసాయనక మూలకం ఎంత ఉందన్నదీ కచ్చితంగా లెక్కించారు.

ఆ శిలలు 16-54 కోట్ల సంవత్సరాల క్రితం భూమికి చేరినట్టుగా ఆగాన్-ఆగాన్ డేటింగ్ ద్వారా ధ్రువీకరించుకున్నారు. రోదసిలో ఉండగా శిలకు అదనంగా ఆగాన్ ఏదైనా చేరిందా? అన్నది కూడా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. యురేనియం-లెడ్ డేటింగ్ వంటి ఇతర పద్ధతులతో వచ్చిన ఫలితాలతో పోల్చి చూసినప్పుడు ఆగాన్-ఆగాన్ ఫలితాలు సరిపోలాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

Related News

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Oppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

Big Stories

×