BigTV English

Hyderabad Gas leak : నడ్డిరోడ్డుపై ఎగిసిపడిన మంటలు.. పరుగులు తీసిన స్థానికులు.. ఇద్దరికి గాయాలు

Hyderabad : హైదరాబాద్‌ నగరంలో సోమవారం గ్యాస్ పైప్‌లైన్ లీక్ ఘటన కలకలం రేపింది. కొంపల్లి, సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్ కావటంతో ఆ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

Hyderabad Gas leak : నడ్డిరోడ్డుపై ఎగిసిపడిన మంటలు.. పరుగులు తీసిన స్థానికులు.. ఇద్దరికి గాయాలు
Hyderabad Gas leak

Hyderabad Gas leak(Latest news in Telangana):

హైదరాబాద్‌ నగరంలో సోమవారం గ్యాస్ పైప్‌లైన్ లీక్ ఘటన కలకలం రేపింది. కొంపల్లి, సుచిత్ర ప్రధాన రోడ్డుపై గ్యాస్ పైప్ లీకైంది. గ్యాస్ పైప్ లీక్ కావటంతో ఆ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.


ప్రధాన రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. మంటల్ని చూసి స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

భాగ్యలక్ష్మి గ్యాస్ సరఫరా పైపు లీక్ అయినట్లు తెలుస్తోంది. రహదారి పక్కనే అభివృద్ధి పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అటువైపు వాహనాలు వెళ్లకుండా కట్టడి చేశారు. అనంతరం భాగ్యలక్ష్మి గ్యాస్ అధికారులకు సమాచారమిచ్చారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేసేందుకు మెయిన్ లైన్ గ్యాస్‌ను ఆపేశారు. ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని.. వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×