BigTV English

School girls molested : 50 మంది పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులు.. నిందితులలో మహిళా టీచర్!

School girls molested : “ఆ టీచర్ మమ్మల్ని ఒక గదిలోకి పంపేది. ఆమె చెప్పినట్లు వినకుంటే కఠినంగా శిక్షిస్తుంది. ఆ గదిలోకి వెళ్లగానే అతను మా మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. చాలా అశ్లీల మాటలు చెప్పేవాడు. ఆ తరువాత అతను ..” అని ఒక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు మీడియా ముందు చెబుతూ ఏడ్చేశారు.

School girls molested : 50 మంది పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులు.. నిందితులలో మహిళా టీచర్!

School girls molested : “ఆ టీచర్ మమ్మల్ని ఒక గదిలోకి పంపేది. ఆమె చెప్పినట్లు వినకుంటే కఠినంగా శిక్షిస్తుంది. ఆ గదిలోకి వెళ్లగానే అతను మా మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. చాలా అశ్లీల మాటలు చెప్పేవాడు. ఆ తరువాత అతను ..” అని ఒక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు మీడియా ముందు చెబుతూ ఏడ్చేశారు. ఈ ఘటన హర్యాణాలో జరిగింది.


హర్యాణా రాష్ట్రంలోని జీంద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే దాదాపు 60 మంది బాలికలు.. ఢిల్లీ మహిళా కమీషన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో 50 మందిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఇందుకు మరో 10 మంది బాలికలు ప్రత్యక్ష సాక్ష్యులుగా సంతకాలు చేశారు. ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా మహిళా కమీషన్ చర్యలు తీసుకుంది. హర్యాణా మహిళా కమీషన్‌ను రంగంలోకి దింపింది.

స్కూల్‌కు విచారణ కోసం చేరుకున్న హర్యాణా మహిళా కమీషన్‌ అధికారులు స్వయంగా ఆ బాలికలను కలిసి విషయం తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ కర్తార్ సింగ్ కీచక కార్యాలలో ఒక మహిళా టీచర్ అతనికి సహాయం చేసేదని తేలింది. దీంతో ఆ స్కూల్ కమిటీ అక్టోబర్ 27న ప్రిన్సిపాల్, నిందితురాలైన మహిళా టీచర్‌ను సస్పెండ్ చేసింది. కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.


సస్పెండైన ప్రిన్సిపాల్, మహిళా టీచర్ బాలికలను తమ వాంగ్మూలం మార్చాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం మళ్లీ మహిళా కమీషన్ దృష్టికి వెళ్లగా.. వారు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని స్కూల్ కమిటీని ప్రశ్నించారు. పోలీసులకు వెంటన ఫిర్యాదు చేయడంతో.. ప్రిన్సిపాల్ పరారయ్యాడు. కానీ పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ కర్తార్ సింగ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణ దశలో ఉంది.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×