BigTV English
Advertisement

5G Smartphones: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. వెంటనే కొనేయండి బాస్!

5G Smartphones: రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ ఫోన్లు ఇవే.. వెంటనే కొనేయండి బాస్!

దేశవ్యాప్తంగా పలు టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు 5G నెట్ వర్క్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొత్త సంవత్సరంలో కొత్తగా 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. 10 వేల లోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పెద్ద డిస్ ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ తో పాటు చక్కటి పనితీరు కనబర్చిచే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం..


రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ ఫోన్లు

⦿ Samsung Galaxy A14 5G- ధర రూ.9,999


ఫ్లిప్ కార్ట్ లో రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోన్ ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా సరికొత్త OneUI 6తో రన్ అవుతుంది. పాపులర్ బ్రాండ్ నుంచి సరసమైన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లు అయితే Samsung Galaxy A14 5Gని కోనుగోలు చెయ్యొచ్చు!

⦿ Motorola G35 5G- ధర రూ. 9,999

Motorola నుంచి విడుదలైన తాజా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. రూ. 10 వేల లోపు 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఫోన్ ను ట్రై చెయ్యొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్, 5,000 mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ FHD+ రిజల్యూషన్ డిస్‌ ప్లే లాంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తున్నది.

⦿ Redmi A4 5G- ధర రూ. 8,499

తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కోసం ట్రై చేస్తున్నట్లు అయితే Redmi A4 5G తీసుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 8,499. మార్కెట్లో అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ ఫోన్లలో ఒకటి. ఈ ఫోన్  5G నెట్‌ వర్క్‌ కు మాత్రమే సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Jio 5G నెట్‌ వర్క్‌ కు అనుకూలంగా ఉంటుంది. Airtel, Vi  NSA-ఆధారిత 5G నెట్‌ వర్క్‌ కు సపోర్టు చేయదలు.

⦿ Redmi 13C 5G, ధర రూ.9,099

Redmi A4 5G మాదిరిగా కాకుండా Redmi 13C 5G SA, NSA 5G నెట్‌ వర్క్ లకు అనుకూలంగా ఉంటుంది. ఇది 90Hz HD+ రిజల్యూషన్ స్క్రీన్‌ ను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్  MediaTek డైమెన్సిటీ 6100+ SoC ద్వారా పవర్ ను పొందుతుంది. 4 GB RAM, 128 GB ఇన్ బిల్ట్ మెమరీని కలిగి ఉంటుంది.

⦿ Poco M6 5G, ధర రూ. 8,499

5G సపోర్ట్‌ తో తక్కువ ధరలో లభించి స్మార్ ఫోన్ లలో ఇదీ ఒక్కటి.  Poco M6 5G ఇంచుమించు Redmi 13C ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ధర మాత్రం తక్కువగా ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో లభిస్తున్నది.

Read Also: వాట్సాప్ లో AI ఇమేజెస్.. క్రియోట్ చేసేయండిలా!

Related News

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Big Stories

×