AI Images On WhatsApp : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చిత్రాలు సృష్టించడం అనేది ఓ సృజనాత్మక విషయమనే చెప్పాలి. ఇప్పటికే ఈ AIతో ఎన్నో చిత్రాలు సృష్టిస్తూ అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం గూగుల్ లో ఉండే పలు వెబ్సైట్స్ లో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఎక్కువ మంది యూజర్స్ ఉపయోగించే వాట్సాప్ లోనే AI చిత్రాలను సృష్టిస్తే ఎలా ఉంటుంది. ఇక ఈ ఆలోచనతోనే మొదలైన వాట్సాప్ AI- పవర్డ్ ఇమేజెస్ వాట్సాప్ యూజర్స్ కు ఓ స్పెషల్ ఛాన్స్. అయితే అసలు వాట్సాప్ లో AI ఇమేజెస్ ను ఎలా క్రియోట్ చెయ్యాలి.. ఇందుకోసం ఏం చెయ్యాలో చూద్దాం.
వాట్సాప్ లో AI- పవర్డ్ ఇమేజెస్ సృష్టించడం చాలా తేలిక. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే అత్యంత తేలిగ్గా ఇమేజెస్ ను మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ను మెటా ఎంతో ఈజీగా తీసుకొచ్చేసింది. ఇందుకోసం ఏం చేయాలంటే..
WhatsAppలో AI చిత్రాలను ఎలా సృష్టించాలంటే –
Step 1: Meta AIతో చాట్‌ను ఓపెన్ చెయ్యాలి.
Step 2: మీ టెక్స్ట్ ప్రాంప్ట్ తర్వాత మెసేజ్ ఫీల్డ్‌లో imagine అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేస్తున్నప్పుడే ఇమేజ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
Step 3: కావల్సిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని సెండ్ ఆఫ్షన్ పై క్లిక్ చెయ్యాలి.
Step 4: ఇప్పుడు క్రియోట్ చేసిన ఇమేజెస్ చాట్‌లో కనిపిస్తాయి.
AI తో క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇమేజెస్ ను డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ సైతం ఉంటుంది. ఇందుకోసం ఆ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి ఆపై సేవ్ చేసుకుంటే సరి.
ఇక ఇప్పటివరకు క్రియేట్ చేసిన ఇమేజెస్ లో కావాల్సిన మార్పులు సైతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కావాలనుకుంటే ఇమేజెస్ ను అప్డేట్ చేసుకోవచ్చు లేదా వాటిలో ఏదైనా మార్పులు చేయవచ్చు. ఇందుకోసం కూడా ఈజీగా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
Step 1: చాట్ లో AI ఇమేజ్ ఓపెన్ చేయాలి
Step 2: ఆ ఇమేజ్ పై లాంగ్ ప్రెస్ చేయాలి
Step 3: రిప్లై బటన్ పై క్లిక్ చేయాలి
Step 4: మెసేజ్ లో కొత్త టెక్స్ట్ ప్రాంప్ట్ ను టైప్ చేయాలి
Step 5: సెండ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్డేట్ చేసిన జనరేటర్ ఇమేజ్ ఇప్పుడు చాట్ లో కనిపిస్తుంది.
వాట్సాప్ లో AI ఇమేజెస్ ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఈ ఇమేజెస్ ను ఉపయోగిస్తున్నప్పుడు మెటా నిబంధనలను అంగీకరిస్తున్నట్లు తెలపాలి. వ్యక్తిగత చాట్స్ తొలగించడానికి లేదా ఇంతకుముందే మీరు ఉపయోగించిన సమాచారాన్ని తొలగించమని చెప్పటానికి వాట్సప్ మీకు పర్మిషన్ ఇస్తుంది. క్రియేట్ చేసిన ఇమేజెస్ పూర్తిగా ఖచ్చితమైనవి కావచ్చు కాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఎవరితో కావాల్సిన ఇమేజెస్ ను ఈ నిబంధనలు ఫాలో అవుతూ క్రియోట్ చేసుకోవచ్చు.
ALSO READ : రేపే ప్రారంభంకానున్న స్మార్ట్ జాతర.. ఈ వారంలోనే టాప్ 4 మెుబైల్స్ లాంఛ్