BigTV English

Daaku Maharaaj: బాలయ్య మూవీలో నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ .. ఎవరో గుర్తుపట్టారా?

Daaku Maharaaj: బాలయ్య మూవీలో నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ .. ఎవరో గుర్తుపట్టారా?

Daaku Maharaaj: నందమూరి నట సింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. గతంలో కన్నా ఎక్కువగా ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకేక్కిన ఈ మూవీలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఒక సాంగ్ చేసింది.. ఈ మూవీ ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. డల్లాస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.. ఈ మూవీ లో నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ నటించినట్లు తెలుస్తుంది.. ఆ డైరెక్టర్ ఎవరో చూద్దాం..


డాకు మహారాజ్ లో క్రేజీ డైరెక్టర్ నటిస్తున్నారని ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. కలర్ ఫోటో ఫెమ్ డైరెక్టర్ సందీప్ రాజ్.. మొదటి సినిమాతోనే అవార్డు అందుకున్న ఈయన డాకు మహరాజ్ మూవీలో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. డాకు మహారాజ్’ ట్రైలర్‌లో తాను కనిపించిన ఫ్రేమ్‌ను అందరితో షేర్‌ చేసుకున్నాడు. బాలయ్య లో తనకు అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేసిన సందీప్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.. అలాగే ఈయన చిత్ర యూనిట్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏం రాశారంటే..?

విజయవాడకు చెందిన నేను స్కూల్ కు వేళ్లేటప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నాను. బాలయ్య గారి తో కలిసి ఇప్పుడు నటుడిగా పరిచయం కావడంతో సంతోషంగా ఉంది. నా కల సాకారమయ్యేందుకు కృషి చేసిన బాబీ అన్నకి రుణపడి ఉంటాను. అలాగే డైరెక్టర్ నాగవంశీకి ధన్యవాదాలు అని సందీప్ రాజ్ ట్వీట్ చేశాడు. దీనిపై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా స్పందించారు. బిగ్‌ ఫిల్మ్‌ కోసం ఫస్ట్‌ ఆడిషన్‌ చేసింది ఎవరు బాబు..? సందీప్‌.. నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన విజువల్స్‌తో బాబీ అదరగొట్టేశారు. బాలయ్య నటనతో థియేటర్లలో జనాలకు పునకాలు రావడం పక్కా.. అయన అంటే నీకు పూనకాలు వచ్చేస్తాయి కదా అని హరీశ్ శంకర్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.. మొత్తానికి ఈ నటుడుగా ఈ డైరెక్టర్ ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూడాలి..


ఇక డాకు మహారాజ్.. 2023లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12 న థియేటర్ లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఫ్యాన్స్ వారం ముందునుంచే హంగామా మొదలెట్టేసారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×