Vivo T3 Ultra Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ యతారీ సంస్థ వివో తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ Vivo T3 Ultra అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.37,999 కాగా, ప్రస్తుతం 21 శాతం తగ్గింపుతో రూ.29,999కే లభిస్తోంది. అంతేకాకుండా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.1,500 అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.28,499కే సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా కస్టమర్లకు రూ.9,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అందువల్ల తీవ్రమైన ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 7.58 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉండే ఈ ఫోన్‌కు నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ అందించారు.
Also Read: తక్కువ ధరకే iPhone, Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్ డేట్స్ వచ్చేశాయ్!
గేమింగ్, మల్టీటాస్కింగ్ సులువుగా చేయడానికి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ (4nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఫోన్ పెర్ఫార్మెన్స్‌ను చాలా వేగంగా అందిస్తుంది. భద్రత కోసం డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. హెవీ యాప్‌లు వాడినా ఫోన్ ఎక్కడా ల్యాగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. ఇక రోజంతా నిరంతరాయంగా వాడుకోవడానికి 5500mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: వావ్.. గూగుల్ పిక్సెల్ 10 ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో షాకింగ్ ప్రైస్!