E-Paper
Advertisement

ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!

ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!
Advertisement

Pet Cameras 2026: పెంపుడు జంతువులను యజమానులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఆప్యాయత కుపిస్తుంటారు. అయితే ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాటిని ఇంట్లో ఒంటరిగా ఉంచాలంటే వారిలో ఒక విధమైన ఆందోళ ఉంటుంది. అయితే ఆ టెన్షన్ కు చెక్ పెడుతూ.. ప్రస్తుతం పెట్స్ కోసం ప్రత్యేకంగా కెమెరాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ.3000 బడ్జెట్ లో లభించే అత్యుత్తమ టాప్ – 5 కెమెరాలు, వాటి ప్రధాన ఫీచర్లపై ఓ లుక్కేయండి.

క్యూబో స్మార్ట్ 360° కెమెరా

దేశీయ కంపెనీ క్యూబో అందిస్తున్న ఈ కెమెరా.. ఇంట్లోని ప్రతి మూలను కవర్ చేస్తుంది. ఇందులో ఉన్న ఏఐ పర్సన్, మోషన్ డిటెక్షన్ ఫీచర్లు పెంపుడు జంతువు కదలికలను ఈజీగా గుర్తిస్తాయి. 3MP స్పష్టమైన విజువల్స్, టూ-వే టాక్ సౌకర్యం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

సీపీ ప్లస్ స్మార్ట్ వై-ఫై కెమెరా

Advertisement

సీసీటీవీల రంగంలో నమ్మకమైన బ్రాండ్ గా సీపీకి పేరుంది. ఈ కంపెనీ తక్కువ బడ్జెట్ లో అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఈ కంపెనీ తెచ్చిన ఈ 3MP కెమెరా ద్వారా రాత్రి వేళల్లో కూడా నైట్ విజన్ సహాయంతో పెట్స్ కదలికలను స్పష్టంగా చూడవచ్చు. ఇది 360 డిగ్రీల వ్యూ మోడ్‌తో వస్తుంది.

ట్రూవ్యూ వై-ఫై రోబోట్ కెమెరా

విభిన్నమైన రోబోట్ డిజైన్‌తో వచ్చే ట్రూవ్యూ కెమెరా.. ఇంటికి స్టైలిష్ లుక్ ను ఇవ్వడంతో పాటు, సెక్యూరిటీని బలోపేతం చేస్తుంది. దీనిలోని Pan-Tilt ఫీచర్ సహాయంతో ఫోన్ యాప్ ద్వారానే కెమెరాను నలువైపులా తిప్పుతూ కంట్రోల్ చేయవచ్చు. పెంపుడు జంతువు ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టి.. అది ఏం చేస్తుందో వాచ్ చేయవచ్చు.

మనోమయ్ ప్రొటెక్ట్ ప్రో కెమెరా

Advertisement

పెంపుడు జంతువుల కదిలికలను నాణ్యమైన విజువల్స్ తో వాచ్ చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. ఇది జంతువులు చేసే శబ్దాలను, వాటి కదలికలను అలర్ట్‌ల రూపంలో ఫోన్‌కు పంపుతుంది. టూ-వే ఆడియో ద్వారా బయట ఉన్నప్పటికీ.. పెంపుడు జంతువులతో మాట్లాడి వాటిని ప్రశాంతపరచవచ్చు.

Also Read: గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!

ఈబిట్‌కామ్ వై-ఫై కెమెరా

చౌక ధరలో నమ్మకమైన పెట్ కెమెరా కోరుకుంటే.. ఈబిట్‌కామ్ బెస్ట్ ఆప్షన్. ఇది ఫుల్ హెచ్ డీ (1080P) వీడియో క్వాలిటీ, క్లౌడ్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్‌తో వస్తుంది. అలారమ్ సిస్టమ్, కదలికలను గుర్తించే మోషన్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: జియోట్యాగ్ 2 vs యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2.. ధరే కాదు, ఫీచర్ల‌లోనూ భారీ తేడా.. రెండిట్లో ఏది బెస్ట్?

Tags

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×