Flipkart Freedom Sale: ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ తీపి కబురు అందించింది. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా Google Pixel 10 సిరీస్‌పై ఊహించని రేంజ్‌లో ఆఫర్లు ప్రకటించింది. అలాగే ప్రముఖ ఆండ్రాయిడ్ ఫోన్లపై నేరుగా భారీ ధర తగ్గింపుతో పాటు బ్యాంకు ఆఫర్లు, ఈఎమ్‌ఐ సదుపాయాలు కూడా లభించనున్నాయి.
ఈ ప్రత్యేక సేల్ ఆగస్టు 8న అధికారికంగా ప్రారంభం కానుంది. Google Pixel 10 మోడల్ అసలు ధర రూ.79,999 కాగా.. సేల్‌లో దీనిని రూ.62,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే దీనిపై నేరుగా రూ.17,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకేసారి అంత బడ్జెట్ పెట్టలేని వారి కోసం నెలవారీ ఈఎమ్‌ఐ రూ.6,999 నుంచి ప్రారంభమయ్యేలా ప్లాన్స్ ఉన్నాయి.
Also Read: వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!
తక్కువ బడ్జెట్‌లో పిక్సెల్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం Pixel 10a మోడల్ ధరను రూ.56,999 నుండి రూ.50,999కి తగ్గించారు. దీనిపై నెలవారీ ఈఎమ్‌ఐ రూ.8,499 నుంచి అందుబాటులో ఉంది. ఇక ప్రీమియం వేరియంట్ అయిన Pixel 10 Proపై రూ.10,000 తగ్గింపు రాగా.. అది రూ.99,999కి దొరుకుతుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ Pixel 10 Pro XL రూ.1,24,999 నుండి తగ్గి రూ.1,14,999 వద్ద లభించనుంది.
ఈ డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు ఎస్‌బిఐ (SBI) క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ల ఫైనల్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.
మంచి కెమెరా క్వాలిటీ, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం, గూగుల్ ప్రత్యేక ఏఐ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ పెద్ద ప్లస్ పాయింట్. పండుగ సీజన్ ప్రారంభానికి ముందే లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ కోసం వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సేల్ మొదలయ్యాక స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. మీకు నచ్చిన ప్రొడక్టులను ముందే సెలక్ట్ చేసి పెట్టుకోవడం ఉత్తమం.
Also Read: 50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!