E-Paper
Advertisement

వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!

వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!
Advertisement

Monsoon AC Tips: వర్షాకాలం రాగానే తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. ఇంట్లో జిగటగా ఉండే తేమ (హ్యుమిడిటీ) వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి చాలామంది డీహ్యూమిడిఫైయర్లు ఉపయోగిస్తారు. అయితే, కేవలం డీహ్యూమిడిఫైయర్ మాత్రమే నడుపుతుంటే గది సరిగ్గా చల్లబడదనిపించి, దానికి తోడుగా ఏసీని కూడా ఆన్ చేస్తుంటారు. ఏసీ గదిని చల్లబరిస్తే, డీహ్యూమిడిఫైయర్ గాలిలోని తేమను లాగేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల కరెంటు బిల్లు భారం పడుతుందని చాలామందికి తెలియదు.

ఏసీ, డీహ్యూమిడిఫైయర్ రెండూ ఒకేసారి వాడినప్పుడు గది చాలా త్వరగా చల్లబడి, హాయిగా అనిపిస్తుంది. వాతావరణం కూడా జిగటగా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. డీహ్యూమిడిఫైయర్ పనిచేసేటప్పుడు కొంత వేడిని బయటకు విడుదల చేస్తుంది. దీనివల్ల గదిని చల్లగా ఉంచడానికి ఏసీ సాధారణం కంటే కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది.

Advertisement

Also Read: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్స్ వరకు బెస్ట్ డీల్స్, తగ్గిన ధరలు చూస్తే..

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈ రెండు పరికరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏసీ ఫిల్టర్లలో బూజు పట్టకుండా ఉండటానికి కనీసం రెండు వారాలకొకసారైనా వాటిని శుభ్రం చేయాలి. అలాగే, డీహ్యూమిడిఫైయర్ వాటర్ ట్యాంక్‌ను ప్రతిరోజూ ఖాళీ చేసి కడగకపోతే బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తుంది. సరైన నిర్వహణ లేకపోతే ఇవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

Advertisement

సాధారణంగా ఒక ఏసీ గంటకు 1.5 నుంచి 2 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. అంటే గంటకు సుమారు రూ.10 నుండి రూ.14 వరకు ఖర్చవుతుంది. మరోవైపు డీహ్యూమిడిఫైయర్ గంటకు 0.3 నుండి 0.7 యూనిట్లు అంటే రూ.2 నుండి రూ.5 వరకు కరెంట్‌ను తీసుకుంటుంది. వీటిని రోజూ ఒక 6 గంటల పాటు కలిపి వాడితే.. కేవలం డీహ్యూమిడిఫైయర్ వల్లనే రోజుకు రూ.12 నుండి రూ.30 అదనంగా ఖర్చవుతుంది. దీంతో నెలకు దాదాపు రూ.350 నుంచి రూ.900 వరకు అదనపు బిల్లు భారంగా మారుతుంది.

బాగా పనిచేసే ఇన్వర్టర్ ఏసీ కొనాలంటే.. రూ.28,000 నుంచి రూ.45,000 వరకు ఖర్చవుతుంది. డీహ్యూమిడిఫైయర్ కోసం మరో రూ.8,000 నుంచి రూ.20,000 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి.. ఇంట్లో తేమ సమస్య చాలా ఎక్కువగా ఉంటే తప్ప, ఈ రెండింటినీ ఒకేసారి కొనడం, వాడటం అంత మంచి నిర్ణయం కాదు.

Also Read: ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×