E-Paper
Advertisement

55 గంటల బ్యాటరీ బ్యాకప్.. అల్ట్రా బేస్ టెక్నాలజీ, ఇంతకంటే ఇంకేం కావాలి?

55 గంటల బ్యాటరీ బ్యాకప్.. అల్ట్రా బేస్ టెక్నాలజీ, ఇంతకంటే ఇంకేం కావాలి?
Advertisement

CMF by Nothing Buds 2: ప్రస్తుత ట్రెండ్‌లో వైర్డు ఇయర్‌ఫోన్స్ స్థానాన్ని పూర్తిగా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆక్రమించేశాయి. మ్యూజిక్ లవర్స్ తమ స్టైల్‌కి తగినట్లుగా ప్రత్యేకమైన డిజైన్ ఉన్న గ్యాడ్జెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లోకి దూసుకొచ్చిన లేటెస్ట్ గ్యాడ్జెట్ CMF by Nothing Buds 2. వైబ్రెంట్ ఆరెంజ్ కలర్ , ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

CMF by Nothing Buds 2 పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్ :

సిఎమ్‌ఎఫ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ డిజైన్ పరంగా చాలా యూనిక్‌గా ఉంటాయి. ఈ మోడల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రత్యేకించి దీని ఆరెంజ్ కలర్ వేరియంట్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా,ట్రెండీగా కనిపిస్తుంది. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఇది ఇతరుల దృష్టిని ఇన్‌స్టంట్‌గా ఆకర్షిస్తుంది. అంతే కాకుండా కేస్ , ఇయర్‌బడ్స్ బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియమ్‌గా ఉండి, ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా వీటిని డిజైన్ చేశారు.

48dB హైబ్రిడ్ ANC :

Advertisement

ఈ ఇయర్‌ బడ్స్ అతిపెద్ద హైలైట్ దీని నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ. ఈ బడ్జెట్ రేంజ్‌లో.. ఏకంగా 48dB హైబ్రిడ్ ANC ఫీచర్ లభించడం నిజంగా విశేషం. మీరు రద్దీగా ఉండే రోడ్లు,బస్సులు,ఆఫీసులు లేదా ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు బయటి అనవసరమైన శబ్దాలను ఇది పూర్తిగా అడ్డుకుంటుంది. దీని వల్ల మీరు పాటలు వినేటప్పుడు లేదా ఆఫీస్ కాల్స్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా .. క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఫీల్ పొందవచ్చు.

అల్ట్రా బేస్ టెక్నాలజీ 2.0:

మ్యూజిక్ లవర్స్ కోసమే ప్రత్యేకంగా ఇందులో అల్ట్రా బెస్ ట్రెక్నాలజీ 2.0 ని అందించారు. మీరు డీప్ బేస్, బీట్ సాంగ్స్ లేదా రాక్ మ్యూజిక్ ఇష్టపడే వారైతే.. దీని ఆడియో ఎక్స్‌పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. బేస్ లెవెల్స్‌ని యూజర్లు తమకు నచ్చినట్లుగా యాప్ ద్వారా.. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీనిలోని పవర్ ఫుల్ డ్రైవర్లు వోకల్స్‌ని కూడా చాలా స్పష్టంగా వినిపిస్తాయి.

Advertisement

Also Read: మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఒప్పో ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్

55 గంటల బ్యాటరీ బ్యాకప్:

పార్టీలు, లాంగ్ జర్నీలు చేసే వారికి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.ఈ విషయంలో CMF Buds 2 అదరగొట్టాయి. ఛార్జింగ్ కేస్‌తో .. కలిపి ఇది ఏకంగా 55 గంటల నాన్‌స్టాప్ ప్లేటైమ్ అందిస్తుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజల తరబడి బ్యాటరీ టెన్షన్ ఉండదు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో.. కొద్ది సేపు ఛార్జ్ చేస్తే.. గంటల తరబడి మ్యూజిక్ ఆస్వాదించవచ్చు.

ధర :

అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, 48dB ANC, అద్భుతమైన ఆరెంజ్ లుక్‌తో వస్తున్న ఈ CMF by Nothing Buds 2 అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 2,799 మాత్రమే. బడ్జెట్ ధరలో.. బెస్ట్ స్టైలిష్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునే.. వారికి ఇది ప్రస్తుతం నంబర్-1 ఛాయిస్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా అధికారిక స్టోర్లలో కొనొచ్చు. ఇప్పుడే ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్‌ను మీ సొంతం చేసుకోండి.

Related News

రూ.30 వేల లోపే 50MP సెల్ఫీ కెమెరా, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్.. వివో ఊరమాస్ డీల్!

తక్కువ ధరకే iPhone, Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్ డేట్స్ వచ్చేశాయ్!

వావ్.. గూగుల్ పిక్సెల్ 10 ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో షాకింగ్ ప్రైస్!

చేతికి అదిరిపోయే లుక్! రూ.1,899కే నాయిస్ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్

వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!

ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!

జియోట్యాగ్ 2 vs యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2.. ధరే కాదు, ఫీచర్ల‌లోనూ భారీ తేడా.. రెండిట్లో ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×