E-Paper
Advertisement

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!
Advertisement

BiggBoss AgniPariksha:బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 10 తెలుగుకి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. అందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రీమియర్ కానున్నట్లు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విజేత కళ్యాణ్ పడాల (Kalyan padala) అధికారికంగా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ షో ప్రయాణానికి ముందు మాటగా.. ఈ ప్రత్యేక కార్యక్రమం కలలు, పట్టుదల, మార్పు అనే భావాలతో ఒక మరుపురాని సంబరంగా నిలవనుంది. ఇక దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా ఆగస్టు 14వ తేదీన ప్రీమియర్ కానుండగా ఈ మేరకు ఒక లాంచ్ వీడియో విడుదల చేసింది.

బిగ్ బాస్ అగ్నిపరీక్షకి ముహూర్తం ఫిక్స్..

ఇందులో కళ్యాణ్ పడాల సాధారణ వ్యక్తిగా అసాధారణ కలలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, బిగ్ బాస్ విజేతగా ఎదిగిన తీరును ఆవిష్కరించారు. ఈ భావోద్వేగ భరితమైన వీడియోలో ధైర్యం , పట్టుదల , కృషి ఉంటే ప్రతి కల నిజమవుతుందనే నమ్మకాన్ని, అలాగే సహన శక్తి నిరంతర ప్రయాణాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే జియో హాట్ స్టార్ నుండి వీడియో విడుదలైన తర్వాత..” కళ్యాణ్ పడాల ప్రయాణం నన్ను పెద్దగా కలలు కనాలని, ఇంకా కష్టపడి పని చేయాలని, ఎప్పుడూ వదిలిపెట్టకూడదని ప్రేరేపించింది” అంటూ ఒక ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని కామెంట్ చేశాడు అంటే ఈ లాంచ్ వీడియో ఎంతగా ప్రేక్షకుల హృదయాలను తాకిందో అర్థం చేసుకోవచ్చు.

ఆదర్శంగా నిలుస్తున్న కళ్యాణ్ పడాల లైఫ్ జర్నీ..

Advertisement

సరైన అవకాశం లభిస్తే.. సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ విజయాలను సాధించగలరని నిరూపిస్తోంది. ఇప్పటికే అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రీమియర్ తేదీ ఖరారు అవ్వడంతో.. దీనిపై ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సీజన్లో సామాన్య ప్రజలు ఎలాంటి సవాళ్లు, భావోద్వేగాలు, సర్ప్రైజులు ఎదుర్కోబోతున్నారో చూడడానికి అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ అగ్నిపరీక్షను జయించి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఎవరు దక్కించుకుంటారు? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతోంది. అత్యుత్తమ ప్రతిభ నిరూపించుకునే వేదికగా రూపుదిద్దుకుంటున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆశావహ పోటీదారులకు తమ వ్యక్తిత్వం, పట్టుదల, పోరాట స్ఫూర్తిని చూపించే అవకాశాన్ని అందిస్తుంది.

also read:వారణాసి స్టోరీ బయటపెట్టిన రాజమౌళి.. రూమర్స్ కి చెక్ పెడుతూ!

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేది ఎవరు?

Advertisement

ఐకానిక్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రతి సవాల్ వారి స్వభావం, ధైర్యం , అలాగే ప్రతి అడ్డంకిని అధిగమించే సంకల్పానికి ఇది నిజమైన పరీక్షగా నిలుస్తుంది. గత సీజన్ లాగా ఈ సీజన్ కి కూడా బిందు మాధవి, అభిజిత్ , నవదీప్ జడ్జెస్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామన్ పీపుల్స్ ను బిగ్ బాస్ సీజన్ 10 లోకి పంపించబోతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. ఈ కొత్త సీజన్ దశావతారం అనే ట్యాగ్ లైన్ తో సరికొత్తగా రాబోతోంది..మరి ఈ సీజన్ ఎలాంటి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×