Honor Play 11 Pro: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తమ కొత్త స్మార్ట్‌ఫోన్ Honor Play 11 Proను చైనా మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి హడావుడి లేకుండా ఈ ఫోన్‌ను లిస్ట్ చేసింది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ యొక్క వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honor Play 11 Pro డిజైన్ పరంగా చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీనిలో 6.6 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్ వాడేటప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. మెటల్ ఫ్రేమ్‌తో వచ్చిన ఈ ఫోన్ కేవలం 7.34 మిల్లీమీటర్ల మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.
Also Read: తక్కువ ధరకే iPhone, Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్ డేట్స్ వచ్చేశాయ్!
ఈ Honor Play 11 Pro పనితీరు వేగవంతంగా ఉండేందుకు మీడియాటెక్ డైమెన్సిటీ 6500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ OS 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఒక సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
ఇందులో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. ఏకంగా 7,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వెయ్యి సార్లు ఛార్జ్ చేసినా బ్యాటరీ హెల్త్ 80 శాతం వరకు చెక్కుచెదరకుండా ఉంటుందని, దాదాపు ఆరేళ్ల పాటు ఇది బాగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. నీళ్లు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66 రేటింగ్ కూడా ఇచ్చారు.
ప్రస్తుతానికి ఈ Honor Play 11 Pro ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర చైనాలో దాదాపు రూ.29,549గా ఉంది. అలాగే ఈ హ్యాండ్ సెట్ మూన్ సిల్వర్, సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
Also Read: రూ.30 వేల లోపే 50MP సెల్ఫీ కెమెరా, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్.. వివో ఊరమాస్ డీల్!