Flipkart Freedom Sale 2026: నేటి ఈ టెక్ యుగంలో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.70 నుంచి రూ.80 వేలు పెట్టాల్సి వస్తోంది. దీంతో సామాన్యులకు నచ్చిన ఫోన్ కొనడం కొంచెం కష్టంగానే మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఫ్లిప్‌కార్ట్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. త్వరలో మొదలయ్యే Freedon Saleలో అద్భుతమైన డిస్కౌంట్లతో ఫోన్లను అమ్మకానికి పెడుతోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ప్రముఖ ఫోన్ల యొక్క తగ్గింపు ధరలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
ఈ ప్రత్యేకమైన సేల్ అందరికీ ఆగస్టు 8 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లు, అలాగే ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు ఒక రోజు ముందుగానే.. అంటే ఆగస్టు 7 నుంచే ఈ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ముందస్తు యాక్సెస్ ద్వారా ఉత్తమ ఆఫర్లను మిస్ కాకుండా త్వరగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ ప్రియుల కోసం ఈ సేల్‌లో మంచి ధరకు ఫోన్లు లభిస్తున్నాయి. పిక్సెల్ 10 మోడల్ రూ.62,999కి లభిస్తుండగా.. పిక్సెల్ 10a ధర రూ.50,999గా ఉంది. కొంచెం ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం పిక్సెల్ 10 ప్రో రూ.99,999కి, ఇక అత్యంత ప్రీమియం వేరియంట్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ రూ.1,14,999కి లభించనుంది.
Also Read: వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!
యాపిల్ ఐఫోన్ల కోసం చూస్తున్న వారిని కూడా ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకుంటోంది. ఐఫోన్ 17 ప్రారంభ ధర దాదాపు రూ.70,900 వరకు ఉండగా, ప్రో మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో రూ. 1,20,900, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ. 130,900 వరకు లభించే అవకాశం ఉంది. వీటితో పాటు ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడల్స్ కూడా మంచి డిస్కౌంట్లలో లభిస్తాయి.
శామ్‌సంగ్ బ్రాండ్ ఇష్టపడే వారి కోసం గెలాక్సీ S26 5G రూ. 79,999కి, గెలాక్సీ S26 అల్ట్రా రూ.1,30,999కి అందుబాటులో ఉండనున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ ఇష్టపడే వారు గెలాక్సీ Z ఫోల్డ్ 8ని రూ.1,70,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉపయోగిస్తే చివరికి దక్కే ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.
వినియోగదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కొనుగోలు చేసే ముందు కార్డ్ నిబంధనలు సరిగ్గా చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: రూ.8,000 లోపే స్టైలిష్ లుక్.. పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌తో CMF Watch 3 Pro!