BigTV English

Healthy Heart:గుండెకు ఆరోగ్యాన్నిచ్చే డైట్.. పరిశోధనల్లో వెల్లడి..

Healthy Heart:గుండెకు ఆరోగ్యాన్నిచ్చే డైట్.. పరిశోధనల్లో వెల్లడి..

Healthy Heart:బలం కోసం, పెరుగుదల కోసం చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నప్పుడు విటమిన్స్‌ టాబ్లెట్స్‌ను అందిస్తూ ఉంటారు. అవి వారిని అనారోగ్యానికి గురికాకుండా చేస్తాయని వారు నమ్ముతారు. అలాగే శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో.. ఒక ఆహార పదార్థం వల్ల పగిలిన గుండెను మామూలుగా మార్చవచ్చని తెలిసింది.


గుండెకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. హార్ట్ ఎటాక్ అనేది ఇప్పుడు చాలామందిలో కామన్‌గా కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. దీనిపై జపాన్‌లో ఒసాకా యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఒక డైట్‌ను ఫాలో అవ్వడం వల్ల కొందరిలో గుండెకు సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉంవచ్చని తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హార్ట్ ఎటాక్ వల్ల చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కోరోనరీ ఆర్టరీ డిసీస్ (కాడ్). దీని వల్ల గుండెకు రక్తాన్ని అందించే ఆర్టరీలు చిన్నగా అవ్వడం లేదా ముసుకుపోవడం జరుగుతుంది. దాని వల్లే హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇలా జరగకుండా ఉండడానికి ప్రస్తుతానికి మార్కెట్లో కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మందులను తట్టుకునే సామర్థ్యం అందరిలో ఉండదని వైద్యులు చెప్తున్నారు.


15 ఏళ్ల క్రితం వైద్యులు.. ఒక కొత్త రకమైన కాడ్‌ (టీజీసీవీ)ను పేషెంట్లలో కనుగొన్నారు. అయితే కాడ్ కోసం అందించే మందులు టీజీసీవీకి పనిచేయడం లేదని వారు గమనించారు. డయాబెటిస్ ఉండి హెమియోడయాలసిస్ చేసుకున్న పేషెంట్లను టీజీసీవీ ఎక్కువగా అటాక్ చేస్తుందని వారు గుర్తించారు. ఇది ఎలా వస్తుందో కనిపెట్టగలిగిన పరిశోధకులు.. దీనికి వైద్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. తాజాగా ఒక ఆహార పదార్థం ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందని వారు భావిస్తున్నారు.

ట్రిక్యాప్రిన్ అనే కెమికల్ ఉన్న ఆహార పదార్థాల వల్ల గుండెపై సెల్స్‌‌లో కొవ్వును మెల్లగా తగ్గించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం కాడ్‌కు సంబంధించి పేషెంట్లు ఒకేలా స్పందించడం లేదని.. అందుకే ఇప్పుడు ఈ డైట్ సప్లిమెంట్ అందరికీ ఉపయోగకరంగా మారుతుందని వారు చెప్తున్నారు. కాడ్ ట్రీట్మెంట్ కోసం దీనిని ఉపయోగించడం వల్ల మందుల తయారీలో ఉపయోగకరంగా మారుతుందని వారు భావిస్తున్నారు.

Related News

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

iPhone Offer: రూ.25,000 తగ్గిన iPhone 16 ప్లస్.. ఇప్పుడు కొనడానికి బెస్ట్ టైమ్!

Laptop Below Rs10000: లెనోవో సూపర్ ల్యాప్‌టాప్ రూ.10000 కంటే తక్కువ.. ఏకంగా 73 శాతం డిస్కౌంట్

Samsung Galaxy: సామ్ సంగ్ గ్యాలక్సీ F17 5G లాంచ్.. గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో పవర్ ఫుల్ ఎంట్రీ

Jio Mart iPhone offer: ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌కి పోటీగా జియోమార్ట్ దిమ్మతిరిగే ఆఫర్.. iPhone కేవలం రూ.44,870 మాత్రమే

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Big Stories

×