E-Paper
Advertisement

వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్‌లో

వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్‌లో
Advertisement

AI Traffic: టెక్నాలజీతో మమేకం కావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు సామాన్యులు. ఇదంతా ఒకప్పటి మాట. సామాన్యులతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ట్రాఫిక్‌లో ఏఐ వినియోగం పెరుగుతోంది. రేపో మాపో హైదరాబాద్ నగరానికి ఆ తరహా పద్దతి రాబోతోంది. ఇంతకీ అసలు మేటరేంటి?

వాహనదారులకు ఏఐతో చెక్

హర్యానాలో మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ ప్రారంభమైంది. వాహనదారులకు ట్రాఫిక్ పరిస్థితులు, రహదారి భద్రత హెచ్చరికలు, సమాచారాన్ని వేగంగా అందించేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఓ వైపు పెరుగుతున్న సిటీ రద్దీకి ట్రాఫిక్ సమస్యకు సాంకేతిక పరిష్కారాలు అవసరం అవుతున్నాయి. ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడం లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ సాంకేతికత వ్యవస్థ, రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది.

గురుగ్రామ్‌లో ఏఐ ఆధారంగా వాహనాల ట్రాఫిక్

Advertisement

మరోవైపు ఏఐ ఆధారిత విధానాలు రవాణా నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యవస్థ వల్ల వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నప్పుడు వాహనాల నెంబర్ ఆధారంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ప్రదర్శిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు వాహనదారుడు తమ చెలాన్ల గురించి తెలుసుకోవడమేకాదు, ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం ఖాయం. సాంకేతికత ఆధారంగా పని తీరు చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు గురుగ్రామ్‌లో ఏఐ సామర్థ్యం గల డిస్‌ప్లేను ఇన్‌స్టాల్ చేశారు. దీనిపై మీరు చలాన్‌లను విస్మరించలేరు అని రాసి ఉంది. మరొక దానిలో హర్యానాలో మొట్టమొదటి స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ గురుగ్రామ్‌లో ప్రత్యక్షమైందని ఉంది.

చలాన్లు ఉన్నా వెంటనే డిస్‌ప్లే

ఈ కూడలి గుండా వెళ్లే వాహనాలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న చలాన్‌లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే ప్రదర్శిస్తుంది. ఆ ఫుటేజ్‌లో స్క్రీన్ ఎలా పని చేస్తుందో తెలిపే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ వీడియోపై ఆన్‌లైన్‌లో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ చొరవను ట్రాఫిక్ ఉల్లంఘనలకు నిరోధకంగా ప్రశంసించారు. మరికొందరు ఇలాంటి సాంకేతికత పెద్ద సమస్యలను పరిష్కరిస్తుందా? అనవసరమైన ఆటంకాలను ఏమైనా సృష్టిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ తరహా పద్దతిని మిగతా రాష్ట్రాలు ఫాలో కావాలని ఆలోచన చేస్తున్నాయి.

Advertisement

ALSO READ: ఆఫర్ అంటే ఇదే.. రూ. 17 వేలకే 40 ఇంచీల టీవీ

 

 

 

 

 

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×