Kratos Pop wireless earbuds: ప్రస్తుత డిజిటల్ యుగంలో వైర్ లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో ..ఉన్నప్పుడు, ఆఫీస్ పని చేస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో పాటలు వినడానికి ఇవి ఎంతో అవసరంగా మారాయి. అయితే మార్కెట్లో.. మంచి బ్రాండ్ ఇయర్ బడ్స్ కొనాలంటే .. వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, స్టూడెంట్స్‌కు అందుబాటు ధరలో ప్రముఖ బ్రాండ్ క్రేటోస్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. అదే ‘క్రేటోస్ పాప్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్’. దీనికి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ అతిపెద్ద హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పాలి. కేవలం రూ.499 ధర కేటగిరీలో ఏకంగా 60 గంటల నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందించడం నిజంగా నమ్మలేని విషయం. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఈ ఇయర్ బడ్స్ రోజల తరబడి పని చేస్తాయి. రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా.. వారానికి ఒకసారి ఛార్జ్ చేస్తే సరి పోతుంది. ప్రయాణాలు చేసే వారికి, తరచూ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయే వారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.
తక్కువ ధర అయినప్పటికీ సౌండ్ క్వాలిటీ , కాలింగ్ విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఈ ఇయర్ బడ్స్ నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీతో వస్తాయి. దీని వల్ల బయట ఉండే అనవసరమైన శబ్దాలు చాలా వరకు తగ్గిపోయి.. మనం వినే మ్యూజిక్ లేదా మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అలాగే బిల్ట్-ఇన్ మైక్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతలి వారికి మన గొంతు ఎలాంటి అడ్డుతగిలే శబ్దాలు లేకుండా క్లియర్‌గా చేరుతుంది.
క్రేటోస్ పాప్ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ట్రెండీగా, మోడ్రన్ డిజైన్‌తో ఉంటాయి. చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఎంతో సౌకర్యంగా ఉండి, ఎంత సేపు వాడినా ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. జిమ్ చేసేటప్పుడు లేదా రన్నింగ్ చేసేటప్పుడు ఇవి చెవుల నుంచి జారి పోకుండా గట్టిగా ఫిట్ అవుతాయి. దీని లైట్ వెయిట్ డిజైన్ కారణంగా దీన్ని జేబులో లేదా బ్యాగులో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.
Also Read: ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!
మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. కేవలం రూ. 499 ధరకే ఇన్ని అద్భుతమైన ఫీచర్లు లభించడం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ ఆశించే ప్రతి ఒక్కరికీ ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. స్టూడెంట్స్ తమ ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, సినిమా చూసేందుకు, పాటలు వినడానికి ఇది బెస్ట్ గాడ్జెట్.
క్రేటోస్ పాప్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అనేది తక్కువ ధరలో.. ఎక్కువ బ్యాటరీ లైఫ్ , మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ గాడ్జెట్. కేవలం రూ. 499 ధరకే లభిస్తున్న ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్‌ను మీరూ వెంటనే ట్రై చేయండి!