E-Paper
Advertisement

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!
Advertisement

iPhone Duo Price: ఇటీవల మార్కెట్లోకి వచ్చిన యాపిల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ (iPhone Duo) ధరలు చూసి సామాన్యులతో పాటు సంపన్నులకు సైతం మైండ్ బ్లాక్ అవుతోంది. దాదాపు రూ.3 లక్షల నుండి రూ.4.5 లక్షల రూపాయల వరకు పలుకుతున్న ఈ ఫోన్ ధర ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ‘అంత ఖరీదైన ఫోన్‌ను కొనే బదులు, అదే డబ్బుతో మన జీవితంలో ఏమేం చేయవచ్చు?’ అనే ఆసక్తికరమైన లెక్కలు తెరపైకి వేస్తున్నాయి. ఒకవేళ మీరూ ఆ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఈ కింద ఉన్న అద్భుతమైన ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి.

44,000 కి.మీ రోడ్ ట్రిప్స్!

ఆ రూ. లక్షలు ఖర్చు చేసి ఐఫోన్ కొనే కంటే.. ఆ డబ్బుతో దాదాపు 44,000 కిలోమీటర్ల మేర రోడ్ ట్రిప్స్ వేయవచ్చు. మీ స్నేహితులతో కలిసి బైక్‌లు లేదా కార్లలో దేశంలోని నలుమూలలా ఉన్న కొండలు, కోనలు, అడవులు, బీచ్‌లను చుట్టేయొచ్చు. లడఖ్ కొండల నుండి కన్యాకుమారి వరకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రయాణాలు చేయొచ్చు. ఆ ఐఫోన్‌లోని స్క్రీన్‌పై ప్రకృతిని చూడటం కంటే స్వయంగా రోడ్డుపై ప్రయాణిస్తూ ఆ అనుభూతిని పొందడం ఎంతో మేలు కదా.

20,000 ప్లేట్ల పానీపూరి, 3,000 ప్లేట్ల చికెన్ రైస్!

Advertisement

ఆహార ప్రియులకైతే ఈ లెక్క వింటేనే నోరూరుతుంది. ఐఫోన్ డ్యుయోకి పెట్టే ఖర్చుతో ఏకంగా 20,000 ప్లేట్ల ఘుమఘుమలాడే పానీపూరి తినేయొచ్చు. ఒకవేళ పానీపూరితో కడుపు నిండకపోతే, రాత్రిపూట స్నేహితులతో కలిసి దాదాపు 3,000 ప్లేట్ల వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్‌ను కూడా ఆరగించవచ్చు. ఒక ఫోన్ కోసం అంత డబ్బు తగలేసేకంటే, కొద్దికాలం పాటు మనకు నచ్చిన ఫుడ్ తింటూ గడిపేయొచ్చు.

15 వేల కప్పుల కాఫీ, 20 వేల ఐస్‌క్రీమ్‌లు!

ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీతో రోజును ప్రారంభించేవారికి ఈ ఆప్షన్ ఒక వరం. ఐఫోన్ డ్యుయో బదులు ఆ డబ్బుతో దక్షిణ భారతదేశపు ఐకానిక్ బ్రాస్ గ్లాసుల్లో లభించే దాదాపు 15,000 కప్పుల ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీలను తాగొచ్చు. లేదంటే నోరూరించే వివిధ రకాల ఫ్లేవర్లు కలిగిన 20,000 ఐస్‌క్రీమ్ కోన్‌లను ఆస్వాదించవచ్చు. గొంతు తడుపుకోవడానికి, మనసును ఆహ్లాదపరుచుకోవడానికి ఇంతకంటే బెస్ట్ డీల్ ఇంకేముంటుంది.

15 ఏళ్ల పాటు జిమ్ మెంబర్‌షిప్

Advertisement

పోనీ ఆ డబ్బుతో మీ ఆరోగ్యాన్ని, శరీరాకృతిని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ డ్యుయోని పక్కనపెడితే ఆ డబ్బుతో ఏకంగా 15 ఏళ్ల పాటు జిమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. లేదంటే బాడీ బిల్డింగ్‌కు అవసరమయ్యే దాదాపు 80 పెద్ద డబ్బాల (Tubs) ప్రీమియం ప్రోటీన్ పౌడర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. 15 ఏళ్ల పాటు మీ శరీరాన్ని ఒక రేంజ్‌లో ఫిట్‌గా మార్చుకోవడానికి ఈ బడ్జెట్ సరిపోతుంది.

Also Read: PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

ఇంకా ఎన్నో.. మరెన్నో..

పైన పేర్కొన్నవి కాకుండా ఐఫోన్ డ్యూయోకు పెట్టే ఖర్చుతో ఏకంగా 900 మూవీ టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. 50 వేల కోడి గుడ్లు, 800 స్టార్ బక్స్ కాపుచినో, 30 వేల ఇడ్లీలతో బ్రేక్ ఫాస్ట్, 20 వేల సమోసాలు, 750 డొమినోస్ ఛీజ్ పీజ్జాలు, 3వేల ప్లేట్ల చికెన్ బిర్యానీ, 5 వేల బర్గర్స్ ఇలా ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. మెుత్తంగా షో-ఆఫ్ కోసం లక్షలు తగలేయడం కంటే జీవితాన్ని నిజమైన రంగులతో, రుచులతో అనుభవించడం మిన్న కదా అన్న అభిప్రాయం నెటిజన్లన నుంచి ప్రధానంగా వినిపిస్తోంది.

Also Read: రూమ్ ఫ్రెష్‌నర్స్ లేకున్నా.. హోటల్ బాత్‌రూమ్స్ చాలా ఫ్రెష్‌.. దీని వెనుక రహస్యం ఇదే!

Tags

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×