E-Paper
Advertisement

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్స్ వరకు బెస్ట్ డీల్స్, తగ్గిన ధరలు చూస్తే..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్స్ వరకు బెస్ట్ డీల్స్, తగ్గిన ధరలు చూస్తే..
Advertisement

Amazon Freedom Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ కు ముహూర్తం ఖరారైంది. భారతదేశపు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ఇప్పటికే ప్రముఖ మోడళ్ల ఆఫర్ ధరలను కంపెనీ టీజ్ చేస్తోంది.

కార్డు డిస్కౌంట్లు, అదనపు ఆఫర్లు:

ఈ ఫ్రీడమ్ సేల్‌లో కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు పెద్ద ఊరటనివ్వనున్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే యూపీఐ వాడేవారికి రూ.150 క్యాష్‌బ్యాక్, అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డు ఉన్నవారికి 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్ల మార్పిడిపై ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు:

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy Z Fold 8 Ultra అసలు ధర రూ.1,99,999 ఉండగా.. సేల్‌లో ఇది రూ.1,90,999కే దక్కనుంది. అంటే.. నేరుగా రూ.9,000 ఆదా చేయవచ్చు. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చే OnePlus 15 phone రూ.89,999కి బదులుగా రూ.81,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫ్లాగ్‌షిప్ మోడల్ Samsung Galaxy S25 Ultra కూడా తక్కువ ధరకు రానుంది.

బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్ల వివరాలు:

Advertisement

మధ్యతరగతి వినియోగదారుల కోసం Samsung Galaxy M47 ధర రూ.30,999 నుండి రూ.25,999కి, iQOO 15R ధర రూ.53,999 నుండి రూ.46,999కి తగ్గాయి. OnePlus 13s ని రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లు ఉన్న Realme Narzo 100x ఫోన్ కేవలం రూ.19,499కే లభిస్తుంది.

అందుబాటులో ఇతర బ్రాండ్లు:

రూ.20,000 లోపు బడ్జెట్ ఫోన్ల కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షన్లు ఉన్నాయి. iQOO Z11 Lite 5Gని రూ.17,999కి, Redmi A7 Pro 5Gని రూ.14,499కి విక్రయిస్తున్నారు. OnePlus Nord CE 6 మోడల్ రూ.31,999కి లభిస్తుండగా.. Lava Bold N2 రూ.8,499కే అందుబాటులో ఉంది. మీ అవసరానికి తగ్గట్టు సరైన ఫోన్‌ను ఎంచుకోవడానికి ఈ సేల్ మంచి అవకాశం అనే చెప్పాలి.

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్న Oppo ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు!

Related News

వావ్.. గూగుల్ పిక్సెల్ 10 ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో షాకింగ్ ప్రైస్!

చేతికి అదిరిపోయే లుక్! రూ.1,899కే నాయిస్ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్

మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఒప్పో ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్

వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!

ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!

జియోట్యాగ్ 2 vs యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2.. ధరే కాదు, ఫీచర్ల‌లోనూ భారీ తేడా.. రెండిట్లో ఏది బెస్ట్?

వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్‌లో

Big Stories

Advertisement
×