E-Paper
Advertisement

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!
Advertisement

Noise 10000 mAh 22.5W power bank: రోజంతా స్మార్ట్‌ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ బ్యాటరీ సమస్య సాధారణంగా ఎదురవుతుంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ బ్రాండ్ నాయిస్ తాజాగా ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. అదే ‘నాయిస్ 10000 mAh 22.5W కాంపాక్ట్ పాకెట్ సైజు పవర్ బ్యాంక్’. తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు కోరుకునే టెక్ లవర్స్‌ను ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పూర్తి ఫీచర్లు:

పాకెట్ సైజు డిజైన్, పోర్టబిలిటీ:

ఈ పవర్ బ్యాంక్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని సైజు , డిజైన్. పేరుకు తగ్గట్టుగానే ఇది చాలా కాంపాక్ట్‌గా, సరిగ్గా పాకెట్‌లో పట్టేలా చిన్న సైజులో ఉంటుంది. అంతే కాకుండా దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని బ్యాగులో లేదా నేరుగా పాకెట్‌లో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. సిల్వర్ కలర్ ఫినిషింగ్ దీనికి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.

22.5W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

Advertisement

చిన్న సైజులో ఉన్నప్పటికీ పని తీరులో మాత్రం ఇది చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ క్షణాల్లోనే చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఆఫీస్ బయటికి వెళ్లే సమయంలో తక్కువ టైమ్‌లో ఫోన్‌కు ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

అన్ని రకాల గ్యాడ్జెట్లకు బెస్ట్:

ఈ నాయిస్ పవర్ బ్యాంక్ కేవలం మొబైల్స్‌కు మాత్రమే పరిమితం కాదు.ఇది ఒక మల్టీపర్పస్ గాడ్జెట్. దీని ద్వారా మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌ వాచ్‌లు, స్మార్ట్‌ బ్యాండ్‌లు, పోర్టబుల్ స్పీకర్లు, టాబ్లెట్లు , ట్రిమ్మర్లను కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కొన్ని రకాల ల్యాప్‌టాప్‌లకు కూడా సపోర్ట్ చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఒక్క పవర్ బ్యాంక్ ఉంటే చాలు, మీ దగ్గర ఉన్న అన్ని ఎలక్ట్రానిక్స్ గార్జెట్లకు చార్జింగ్ చేసుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు:

Advertisement

ఇందులో పవర్ ఫుల్ 10000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీని వాడారు. ఇది సాధారణ స్మార్ట్‌ ఫోన్‌ను ఈజీగా రెండు సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అలాగే ప్రయాణాల్లో గ్యాడ్జెట్లు సురక్షితంగా ఉండటానికి మల్టిపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అందించారు. ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి మీ డివైజెస్‌ను ఇది పూర్తిగా రక్షిస్తుంది.

Also Read: ఇదేం డిజైన్ భయ్యా! మార్కెట్‌ను షేక్ చేస్తున్న సోనీ ఇయర్‌బడ్స్

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్ల పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే.. కేవలం రూ. 1698 ధరకే ఈ ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయం. స్టూడెంట్స్, ట్రావెలర్స్ , నిత్యం బయట తిరిగే ఉద్యోగులకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు.

మొత్తానికి.. నాయిస్ 10000 mAh 22.5W కాంపాక్ట్ పాకెట్ సైజు పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరి బ్యాగులో ఉండాల్సిన అత్యవసర గాడ్జెట్. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ-డివైస్ సపోర్ట్ కోరుకునే వారికి ఇది నంబర్ వన్ ఛాయిస్!

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×