E-Paper
Advertisement

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!
Advertisement

Smart Gadgets: లాంగ్ రోడ్ ట్రిప్‌కు బయలుదేరినప్పుడు ప్రయాణం ఎంజాయ్ చేయడంతో పాటు ఇంధన ఖర్చు కూడా తగ్గించుకోవాలని ప్రతి వాహనదారుడు అనుకుంటారు. అయితే మైలేజీ అనేది ఇంజిన్ పనితీరుపైనే ఆధారపడదు. టైర్లలో సరైన గాలి ఉండటం, వాహనాన్ని ఎంత వేగంతో నడుపుతున్నాం, ట్రాఫిక్ పరిస్థితులు, వాహనంపై ఉన్న బరువు, రెగ్యులర్ సర్వీసింగ్ వంటి అంశాలు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయి.

అయితే ఈ విషయాలను ఎప్పటికప్పుడు గమనించేందుకు కొన్ని స్మార్ట్ గాడ్జెట్లు ఉపయోగపడతాయి. ఇవి నేరుగా పెట్రోల్ లేదా డీజిల్‌ను ఆదా చేసే పరికరాలు కావు. కానీ టైర్ ప్రెజర్‌ను చెక్ చేయడం, వాహనంలో వచ్చే చిన్న సమస్యలను ముందుగానే గుర్తించడం, డ్రైవింగ్ అలవాట్లను గమనించడం వంటి విషయాల్లో సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో ఇలాంటి గాడ్జెట్లు వెంట ఉంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, కాస్త స్మార్ట్‌గా మారుతుంది.

టైర్ ప్రెజర్ మానిటర్..

Advertisement

టైర్లలో గాలి తగ్గితే ఇంధన వినియోగం పెరగొచ్చు. అందుకే టైర్ ప్రెజర్ మానిటర్ లాంగ్ ట్రిప్‌లో ఉపయోగపడే గాడ్జెట్. టైర్‌లో గాలి ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గాలి తక్కువగా ఉన్నప్పుడు ముందే గుర్తించి సరిచేసుకోవచ్చు. కారు, బైక్‌కు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవాలి.

పోర్టబుల్ ఇన్‌ఫ్లేటర్..

దారిలో టైర్‌లో గాలి తగ్గితే వెంటనే సరిచేయడానికి పోర్టబుల్ టైర్ ఇన్‌ఫ్లేటర్ ఉపయోగపడుతుంది. కారు, బైక్‌లో సులభంగా పెట్టుకునే చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రయాణానికి ముందు ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే.. టైర్‌కు ఎంత అవసరమో అంతే గాలినే పెట్టాలి.

Advertisement

Also Read: ఒంటరి ప్రయాణంలో దారి తప్పినా, ఆపదలో ఉన్నా.. ఈ యాప్స్ క్షణాల్లో ఆదుకుంటాయి!

OBD స్కానర్..

కారులో OBD స్కానర్ ఉంటే ఇంజిన్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను గుర్తించవచ్చు. చెక్ ఇంజిన్ లైట్ వెలిగినప్పుడు సమస్య ఏ భాగానికి సంబంధించినదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రిప్‌కు ముందు సమస్యలు ఉంటే గుర్తించి సర్వీస్ చేయించుకోవడం వల్ల దారిలో ఇబ్బందులు తగ్గుతాయి.

డ్రైవింగ్ యాప్‌లు..

కొన్ని మొబైల్ యాప్‌లు వేగం, ప్రయాణ దూరం, ఇంధన వినియోగం వంటి వివరాలను గమనించడానికి సహాయపడతాయి. వీటితో మన డ్రైవింగ్ పద్ధతిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ వేగం, తరచూ గట్టిగా బ్రేక్ వేయడం, ఒక్కసారిగా వేగం పెంచడం వంటి అలవాట్లు మైలేజీని తగ్గించవచ్చు.

నావిగేషన్ పరికరాలు..

మంచి నావిగేషన్ యాప్ లేదా పరికరం ట్రాఫిక్, రూట్ మార్పులు, ప్రయాణ సమయం వంటి వివరాలను ముందుగానే చూపిస్తుంది. దీంతో అవసరం లేని దారులు తగ్గించుకోవచ్చు. అయితే నావిగేషన్ పరికరం నేరుగా మైలేజీ పెంచదు. సరైన రూట్ ఎంచుకోవడంలో మాత్రమే సహాయపడుతుంది.

ముందస్తు జాగ్రత్త..

అయితే.. మైలేజీ పెంచుతామని చెప్పే ప్రతి గాడ్జెట్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. టైర్ ప్రెజర్, వాహనం నిర్వహణ, సరైన వేగం, సాఫీగా డ్రైవింగ్ చేయడం వంటి ప్రాథమిక విషయాలకే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి తోడుగా సరైన స్మార్ట్ గాడ్జెట్లు ఉపయోగిస్తే లాంగ్ ట్రిప్‌లో ఇంధన వృథాను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే గాడ్జెట్ కొనేటప్పుడు వాహనానికి అనుకూలంగా ఉందో చూడాలి. ముఖ్యంగా బైక్‌లలో అన్ని పరికరాలు ఒకే విధంగా పనిచేయవు. తయారీదారు సూచనలు, వినియోగదారుల అనుభవాలు చూసి కొనడం మంచిది.

Also Read: చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!

Tags

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×