E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?
Advertisement

Airtel Insider Offers: కాల్స్, డేటా సేవలే కాకుండా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందించడంలో ఎయిర్‌టెల్ ముందు వరుసలో నిలుస్తోంది. ‘ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్’ (Airtel Insider) ప్రోగ్రామ్ ద్వారా విద్య, షాపింగ్, వినోదం, ఆరోగ్యం వంటి రంగాల్లో రూ.30,000కు పైగా విలువైన ఆఫర్లను పొందే వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పించింది. సూపర్ డ్యుయోలింగో (Super Duolingo) సబ్‌స్క్రిప్షన్, ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్లు, సినిమా టికెట్లపై ఆఫర్లు, ఫుడ్ ఆర్డర్లపై తగ్గింపు వంటి ఎన్నో రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

ఇన్ సైడర్ ఆఫర్ బెనిఫిట్స్ ఇలా..

యూజర్ల విభిన్న అవసరాలను తీర్చేలా పలు బ్రాండ్లతో కలిసి ఎయిర్‌టెల్ ఈ ఆఫర్లను రూపొందించింది. ఇందులో భాగంగా ‘సూపర్ డ్యూయోలింగో’ సబ్ స్క్రిప్షన్ ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ విలువ రూ.3,120 కావడం విశేషం. మరోవైపు క్రోమా (Croma), యాపిల్ (Apple) భాగస్వామ్యంతో ఎంపిక చేసిన ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లపై రూ. 23,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది.

సినిమా టికెట్లు, ఫుడ్‌పై ఆఫర్లు

Advertisement

పాకెట్ ఎఫ్‌ఎం ప్రీమియం (Pocket FM Premium) మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ను సైత ఇన్ సైడర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్ టెల్ అందిస్తోంది. మరోవైపు సినిమా టికెట్లను కూడా రాయితీలో పొందే వీలు కల్పిస్తోంది. దీని కింద సినీపోలిస్ (Cinepolis)లో రెండు సినిమా టికెట్లు కొంటే ఒకటి ఉచితంగా పొందవచ్చు. గరిష్టంగా రూ.150 వరకూ రాయితీ పొందొచ్చు. అటు సినీపోలిస్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆర్డర్లపై ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.300 ఆదా చేసుకోవచ్చు. అయితే కనీస ఆర్డర్ విలువ రూ.1,500గా నిర్ణయించారు. హెల్త్ విషయానికి వస్తే.. అపోలో 24×7 (Apollo 24×7) అందించే 6 నెలల అపోలో సర్కిల్ మెంబర్‌షిప్ కూడా ఇందులో లభిస్తుంది.

రూ.30 వేలకు పైగా ఆదా..

పైన పేర్కొన్న ఇన్ సైడర్ డీల్స్ అన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లు రూ.30,000కు పైగా విలువైన ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ప్రతి ఆఫర్‌కు ప్రత్యేక నిబంధనలు, అర్హత ప్రమాణాలు ఉంటాయని స్పష్టం చేసింది. కాబట్టి ఏ ఆఫర్‌నైనా ఉపయోగించుకునే ముందు పూర్తి వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిదని ఎయిర్ టెల్ వర్గాలు సూచిస్తున్నాయి.

Advertisement

Also Read: ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?

ఈ ఆఫర్లను ఎలా పొందాలి?

ఇన్ సైడర్ ఆఫర్ ప్రయోజనాల కోసం వేర్వేరు సైట్లకు వెళ్లాల్సిన పని లేదని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ ను ఉపయోగించి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చని తెలియజేశాయి. ముందుగా ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ లో రిజిస్టర్ మెుబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. యాప్ లోని ఎయిర్ టెల్ ఇన్ సైడర్ విభాగంలోకి వెళ్తే.. ఆఫర్ల వివరాలు కనిపించనున్నాయి. అక్కడ యూజర్లు తమకు కావాల్సి ఆఫర్ ను ఎంచుకొని స్క్రీన్ పై కనిపించే సూచనలు పాటిస్తూ రివార్డ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read: ముంచుకొస్తున్న నిరుద్యోగ ముప్పు.. రెండేళ్లలో శాశ్వతంగా ఉపాధికి దూరం.. ఏఐ పరిశోధకుడి సంచలన హెచ్చరిక!

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

రూ.8,299కే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

సామాన్యుల రీఛార్జ్ భారం తగ్గిస్తున్న BSNL.. రూ.172కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు!

వాట్సప్ చాటింగ్ ఇక మరింత ఫన్.. మెసేజ్‌లకు స్టిక్కర్లతోనే రియాక్ట్ అయ్యే కొత్త ఫీచర్!

Big Stories

Advertisement
×