Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాల పనులలో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు. త్వరలోనే ఈమె నటించిన మైసా(Mysaa) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇలా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా తన అత్తయ్యతో కలిసి పుట్టపర్తి(Puttaparthi)లో సందడి చేశారు. ప్రస్తుతం పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా(Sri Satya Sai Baba) 101వ జయంతి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న సైతం ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ విధంగా సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలలో భాగంగా ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న రష్మిక మందన్న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ భక్తురాలిలాగా సాయిబాబా మహా సమాధిని దర్శించుకుని సత్యసాయి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఈ వేడుకలలో భాగంగా సత్య సాయి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈమె పాల్గొన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న రష్మిక మందన్న మాట్లాడుతూ సత్య సాయి బాబా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. సత్య సాయి బాబా గురించి నాకు ఏ విధమైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ తన భర్త విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల ద్వారా స్వామివారి బోధనలు ఆధ్యాత్మిక విలువలతో మంచి పరిచయం ఏర్పడిందని తెలిపారు. సత్య సాయి బాబా చేసిన వ్యాఖ్యలు కేవలం మాటలు మాత్రమే కాదు మనం మన జీవితంలో అనుసరించాల్సిన జీవన విధానాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఆధ్యాత్మికంగా మానసికంగా ఎంతో బలంగా ఉండాలని, మహిళలే సమాజానికి పునాదులని తెలిపారు. మహిళా శక్తి అంటే కేవలం కష్టాలను భరించడం మాత్రమే కాదు అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడే శక్తి అని కూడా తెలిపారు.
ఇటీవల కాలంలో మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత కేవలం సామాజిక లక్ష్యం మాత్రమే కాదని, దేశాభివృద్ధికి ఎంతో అవసరమైన అంశమని తెలిపారు. ప్రస్తుతం సత్య సాయి బాబా స్వామి వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన బోధనలు ఎంతోమంది భక్తులకు మార్గదర్శకంగా నిలిచాయని ఈ సందర్భంగా రష్మిక మందన్న మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలలో భాగంగా విజయ్ దేవరకొండ హాజరు కాకపోయినప్పటికీ రష్మిక విజయ్ దేవరకొండ తల్లి మాత్రమే పాల్గొని సందడి చేశారు.
Also Read: రాధిక ఆప్టే వ్యాఖ్యలపై స్పందించిన కీర్తి సురేష్..ఏమన్నారంటే?