BigTV English

Viral Video: రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. అసలు ప్రాణాలంటే లెక్కే లేదు వీరికి

Viral Video: రీల్స్ పిచ్చితో డేంజరస్ స్టంట్స్.. అసలు ప్రాణాలంటే లెక్కే లేదు వీరికి

Viral Video: సోషల్ మీడియా హవా ఉన్న ఈ కాలంలో రీల్స్ చేయడం అంటే యువతకు ఓ క్రేజ్ అయిపోయింది. రాత్రి, పగలు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అంతేకాదు రీల్స్ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. ఈ తరుణంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తరచూ ఏదో రకమైన విన్యాసాలు చేస్తూ నెట్టింట వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.


కార్లు, బైకులపై వెళుతూ రోడ్లపై విన్యాసాలు ప్రదర్శించడం, రైలు పట్టాలపై నిల్చుని సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రాణాంతకర వీడియోలు చేస్తున్నారు. ఇలా కొంతమంది వీడియోలు చేసి బ్రతికి బయటపడుతున్నా, మరికొంత మంది మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి తరహాలోదే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూణేలోని జంబుల్ వాడీ స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఓ పాడుబడిన భవనంపై యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ కనిపించారు.

ఓ యువకుడు యువతిని బంగ్లాపై నుంచి దూకుతున్నట్లు చిత్రీకరించాలని, అతడు ఆ యువతిని కాపాడినట్లు వీడియోను తీశారు. దీనికి పక్కనే ఉన్న మరో యువకుడు వీడియో తీస్తూ ఉండగా, యువతి, యువకులు ఇద్దరు కలిసి స్టంట్స్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటువంటి ప్రమాదకర దృశ్యాలు చిత్రీకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


Related News

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Bar in Van: వారెవ్వా మొబైల్ బార్లు, రమ్మన్న చోటుకు వచ్చేస్తాయ్!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Big Stories

×