BigTV English
Advertisement

Best Mobile Offer: రూ.776లకే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లాక్ ఆఫర్.. పిచ్చెక్కిస్తున్న కెమెరా!

Best Mobile Offer: రూ.776లకే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లాక్ ఆఫర్.. పిచ్చెక్కిస్తున్న కెమెరా!

Best Mobile Offer: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడటం కోసమే కాదు.. అందులో బెస్ట్ కెమెరా కూడా ఉండాలి. మొబైల్ లవర్స్ కెమెరా ఫీచర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటువంటి వారి కోసమే అమోజాన్ బెస్ట్ డీల్ తీసుకొచ్చింది. మీరు తక్కువ ధరకే అదిరిపోయే కెమెరా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 108 మెగాపిక్సెల్‌తో ఉన్న TECNO SPARK 20 PRO 5G భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అలానే ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అయితే ఈ ఫోన్ అసలు ధర ఎంత, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలను తెలుసుకుందాం.


అమోజాన్‌లో టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 19,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్‌ ధర రూ.15,999కి చేరుకుంటుంది. అదనంగా అన్ని బ్యాంకు కార్డులపై రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ రూ.13999కి మీ సొంతం అవుతుంది.

Also Read: iPhone 16: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఇక మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు.. భారీగా తగ్గనున్నధరలు!


ఈ ఫోన్‌పై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ.14,600 తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌చేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. అలానే రూ.776 అతి తక్కువ ఈఎమ్‌ఐతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Tecno Spark 20 Pro 5G Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 2460×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ LCD ప్యానెల్‌ను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 580 నిట్‌లు. ఫోన్ 8 GB RAM + 256 GB వరకు UFS 2.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో ఈ ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరుగుతుంది.

ప్రాసెసర్‌గా ఫోన్ Mali-G57 MC2 GPUతో MediaTek Dimension 6080 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను అందిస్తోంది. వీటిలో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ ఉన్నాయి. అదే సమయంలో కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. పవర్ కోసం ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 10 వాట్ల రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Also Read: Cheapest Phones: అదరగొట్టే ఫోన్లు.. అతి తక్కువ ధరకే.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

OS గురించి చెప్పాలంటే ఈ ఫోన్ Android 14 ఆధారంగా XOS 14లో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 5G SA/NSA, Dual 4G LTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-సి పోర్ట్ అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×