BigTV English

Vinukonda YCP Leader Murder: వైసీపీ కార్యకర్త దారుణ హత్య..మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే?

Vinukonda YCP Leader Murder: వైసీపీ కార్యకర్త దారుణ హత్య..మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే?

Jagan respond on Vinukonda YCP Leader Murder(AP politics): పల్నాడు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడు మరో యువకుడిని దారుణంగా హత్య చేశాడు. వినుకొండలోని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో హత్యకు గురైన వ్యక్తి వైసీపీ కార్యకర్తగా గుర్తించారు. అయితే వైసీపీ కార్యకర్త రషీద్ హత్య విషయంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపాడు. మృతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం జరుగుతోందని, ఈ కారణంగా వారి వివాదం ముదరడంతో హత్యకు దారితీసిందని ఎస్పీ వెల్లడించారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.


ఇదిలా ఉండగా, ఈ హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఎక్స్ వేదికగా దుయ్యబెట్టారు. వైసీపీని రాష్ట్రంలో అణగదొక్కడానికి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వినుగొండలో నడిరోడ్డుపై హత్య జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు పెరిగిపోయాయని విమర్శలు చేశారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే విధ్వంసం సృష్టించిందన్నారు.

భవిష్యత్తులో మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలతోపాటు ఇక్కడ దిగజారిన రాజకీయ పరిస్థితులను పీఎం నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


Also Read: విశాఖ జనానికి షాకిస్తున్న టమాటా ధరలు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్ధేశాలతో వెనక ఉంటూ ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబను హెచ్చరిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. వైసీప కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోస ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా, హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

అంతకుముందు హత్య జరిగిన తర్వాత వైసీపీ.. ‘మేడం ప్రెసిడెంట్..ఏపీ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్వీట్ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతి కలుగజేసుకొని ప్రజలను కాపాడాలని అందులో పేర్కొన్నారు.

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×