BigTV English

Android 16 : ఆండ్రాయిడ్ 16.. ఫీచర్లు, డిజైన్ ఇక అన్నీ ఛేంజ్.. యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్

Android 16 : ఆండ్రాయిడ్ 16.. ఫీచర్లు, డిజైన్ ఇక అన్నీ ఛేంజ్.. యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్

Android 16 | గూగుల్ సంస్థ ఇటీవల ది ఆండ్రాయిడ్ షో: I/O ఎడిషన్‌‌ను నిర్వహించింది. గూగుల్ I/O 2025కు లాంచ్ మే 20-21 జరుగనుండగా.. అంతకుముందు ఈ ఆండ్రాయిడ్ షో: I/O తో ప్రపంచానికి కొత్త ఓఎస్‌ని పరిచయం చేసింది. ఈ ఈవెంట్‌లో.. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 16, ఆండ్రాయిడ్ ఈకోసిస్టమ్‌లో వచ్చే ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 16, వేర్ ఓఎస్ 6లో రీడిజైన్‌లు, అన్ని గూగుల్ డివైస్‌లలో జెమినీ ఏఐ, సైబర్ మోసగాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త భద్రతా ఫీచర్లు, డివైస్‌లను సురక్షితంగా ఉంచడానికి మెరుగైన భద్రతా చర్యలు ఈ ఓఎస్ లో హైలైట్. ఈ ఫీచర్ల గురించి వివరింగా..


అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్

అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ కీలక భద్రతా సెట్టింగ్‌లకు కేంద్రీకృత కంట్రోల్ పాయింట్‌గా పనిచేస్తుంది. ఇది డివైస్‌ల కోసం ఇప్పటికే ఉన్న, కొత్త భద్రతా ఫీచర్లను నిర్వహిస్తుంది, కీలకమైన ప్రాంతాల్లో అవి యాక్టివేట్ అయ్యేలా డిజేబుల్ కాకుండా చూస్తుంది. ఆండ్రాయిడ్ 16 యూజర్లకు అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్‌ కోసం మెరుగైన సెక్యూరిటీ టూల్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ 16.. హైలైట్‌లలో ఇంట్రూషన్ లాగింగ్ (డివైస్ భద్రతా లాగ్‌ను క్లౌడ్‌లో సురక్షితంగా నిల్వ చేస్తుంది), యూఎస్‌బీ ప్రొటెక్షన్, అసురక్షితమైన నెట్‌వర్క్‌లలో ఆటోమెటిక్ రీకనెక్షన్‌ను డిజేబుల్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఇక ఫోన్ లో గూగుల్ స్కామ్ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది.


స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకుంటే ఇకపై ఫైండ్ హబ్ ఉపయోగించాలి
ఆండ్రాయిడ్ ఫైండ్ మై డివైస్ ఇప్పుడు ఫైండ్ హబ్‌గా రూపాంతరం చెందింది. శాటిలైట్ కనెక్టివిటీ జోడింపుతో భద్రతను మరింత మెరుగుపరిచింది. ఈ ఫీచర్ సెల్యులార్ సర్వీస్ లేని ప్రాంతాల్లో కూడా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది, మీ వస్తువులు, ప్రియమైన వారిని సులభంగా కనుగొనడానికి వీలు కల్పిస్తుంది.

జెమినీ ఆన్ ఆండ్రాయిడ్ ఆటో
గూగుల్ ఇప్పుడు వేర్ ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లకు జెమిని ఏఐని రోల్ అవుట్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ ఆటోలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్, వేర్ ఓఎస్ రిఫ్రెషింగ్
ఈ వెర్షన్ లో ఆండ్రాయిడ్ మెటీరియల్ 3 అందుబాటులోకి రానుంది. దీంతో మరిన్ని కస్టమైజేషన్లు చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు నోటిఫికేషన్‌ను డిస్‌మిస్ చేసినప్పుడు, పక్కనే ఉన్న నోటిఫికేషన్‌లు మీ స్వైప్‌కు సూక్ష్మంగా స్పందిస్తాయి. దాన్ని స్టాక్ నుంచి తొలగించినప్పుడు, ఈ ఫీచర్ సంతృప్తికరమైన హాప్టిక్ రెస్పాన్స్ అనుభవాన్ని కలిగిస్తుంది.

Also Read: వర్క్ ఫ్రమ్ హోంతో సమస్యలు.. ఆఫీసుకే వస్తా.. టెకీ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ

అదేవిధంగా, ఆండ్రాయిడ్ యాప్‌ను మూసివేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ షేడ్‌ను సున్నితంగా బ్లర్ చేస్తుంది. ఇంకా ఈ ఓఎస్‌లో నవీకరించబడిన డైనమిక్ కలర్ థీమ్‌లు, రెస్పాన్సివ్ కాంపోనెంట్‌లు, ఉద్ఘాటిత టైపోగ్రఫీ కూడా రానున్నాయి. దీంతో యూజర్లు ఇప్పుడు క్విక్ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్లాష్‌లైట్, డో నాట్ డిస్టర్బ్ వంటి యూజర్ల ఇష్టమైన చర్యలను ఒకే చోట సరిపోయేలా చేయవచ్చు. అదనంగా, కొత్త లైవ్ అప్‌డేట్స్ ఫీచర్ ఎంచుకున్న యాప్‌ల నుండి ప్రోగ్రెస్ నోటిఫికేషన్‌లను సులభంగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

దీంతోపాటు గూగుల్ వాచ్ ఇంటర్‌ఫేస్‌కు కూడా డైనమిక్ కలర్ థీమింగ్‌ను వర్తింపజేస్తోంది. మీరు మీ వాచ్ ఫేస్ కోసం ఎంచుకున్న థీమ్ ఇక సిస్టమ్ అంతటా ప్రతిబింబిస్తుంది. అదనంగా, డిస్‌ప్లేకు చక్కగా సరిపోయే గ్లాన్సబుల్ బటన్‌లను రూపొందించారు. ఇవి స్పేస్ ఎఫిషియెంట్ కావడంతో ట్యాప్ చేయడం సులభంగా మారుతుంది.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×