BigTV English

Sanjiv Goenka Donation: తిరుమల శ్రీవారికి LSG ఓనర్ భారీ విరాళం.. పంత్ సెంచరీ కొట్టడం పక్కా

Sanjiv Goenka Donation: తిరుమల శ్రీవారికి LSG ఓనర్ భారీ విరాళం.. పంత్ సెంచరీ కొట్టడం పక్కా

Sanjiv Goenka Donation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో… లక్నో సూపర్ జెంట్స్ జట్టు ఓనర్, భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకా ( Sanjiv Goenka ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారికి భారీగా ఆభరణాలను విరాళంగా ప్రకటించారు లక్నో ఓనర్ సంజీవ్‌ గోయెంకా ( Lucknow owner Sanjeev Goenka ). తాజాగా… లక్నో జట్టు ఓనర్ సంజీవ్‌ గోయెంకా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి… తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లక్నో ఓనర్ సంజీవ్‌ గోయెంకా కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి ఆభరణాలను విరాళంగా ఇచ్చారు.


Also Read: Hardik Pandya’s Ex wife : ప్రియుడితో కారులోనే సరసాలు.. నరకం అనుభవిస్తున్న పాండ్యా

ఏకంగా ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు సంజీవ్‌ గోయెంకా. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, అదే సమయంలో వరద హస్తాలను కూడా అందజేశారు. ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి… తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని… లక్నో ఓనర్ సంజీవ్‌ గోయెంకా కుటుంబానికి ప్రత్యేకంగా కల్పించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అయితే తిరుమల శ్రీవారి కి లక్నో ఓనర్ సంజీవ్… భారీ విరాళం ఇవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. లక్నో ఈసారి ఛాంపియన్గా గెలవాలని… 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రిషబ్ పంత్ సెంచరీ చేయాలని ఈ సందర్భంగా… లక్నో ఓనర్ కోరినట్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా ఐదు కోట్లు విలువ చేసిన ఆభరణాలు లక్నో ఓనర్ అందించాడని.. కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Andrew Symonds: వివాదాలకు కేరాఫ్ సైమండ్స్.. స్టేడియంలో ఫ్యాన్ ను చితకబాదాడు

 

ఐపీఎల్ 2025లో ( Indian Premier League 2025 Tournament ) విఫలమైన రిషబ్ పంత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్  ( Indian Premier League 2025 Tournament )మెగా వేలంలో అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంతో కష్టపడి లక్నో ఓనర్ 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ ను కొనుగోలు చేశాడు. అయితే ఆ 27 కోట్లకు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఏమాత్రం న్యాయం చేయడం లేదు. ఇప్పటి వరకు లక్నో జట్టు మొత్తం 11 మ్యాచ్లు ఆడింది. ఈ అన్నిట్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు రిషబ్ పంత్ ( Rishabh pant). కానీ పేరుకు 27 కోట్లు దొబ్బేశాడు. కేఎల్ రాహుల్ ను కాదని… రిషబ్ పంతును కొనుగోలు చేస్తే.. లక్నో ఓనర్ సంజీవ్ కు పంగనామాలు పెట్టాడు. కాగా ఇప్పటివరకు లక్నో 11 మ్యాచులు ఆడగా ఐదు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో పది పాయింట్లు సాధించిన లక్నో… ప్లే ఆఫ్ కోసం పోరాడుతోంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×