Techie Work From Home| అయిదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వసతి (వర్క్ ఫ్రమ్ హోం) కల్పించాయి. ఈ విధానంతో ఉద్యోగులకు ఆఫీసుకు రాకపోకలు చేసే సమయం మిగిలింది. పైగా ఆఫీసు పని ఏదైనా అత్యవసరమైతే.. ఏ సమయంలోనైనా ఉద్యోగి స్పందించేందుకు అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఎండలు, వానలు, ట్రాఫిక్ సమస్యలకు ఓర్చి ఉదయం కచ్చితంగా 9 గంటలకు ఆఫీసుకు చేరుకోవాలనే ఒత్తిడి నుంచి ఉద్యోగులకు విముక్తి లభించింది. ఇన్ని లాభాలున్నా.. వర్క్ ఫ్రమ్ హోం విధానంతో నష్టాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగు ఏ పని విధానం బెటర్ ఆఫీసుకెళ్లి పనిచేయడమా? లేక ఇంటి నుంచే పనిచేయడమా? అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పెద్ద చర్చ ప్రారంభించారు. ఈ చర్చలో పాల్గొన్న ఒక రెడ్డిట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూజర్ ఆశ్చర్యకరంగా ఆఫీసుకెళ్లి పనిచేయడమే ఉత్తమమని సమాధానమిచ్చాడు. దానికి సహేతుకంగా కారణాలు కూడా ఇచ్చాడు. తాను గత రెండేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నానని.. ఒంటరిగా పనిచేయడం అలవాటుపడి దీంతో తాను నలుగురిలో కలివిడిగా ఉండలేకపోతున్నానని చెప్పాడు. కానీ ఇటీవలే తాను ఒక కొత్త కంపెనీలో చేరగా.. అక్కడ వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రమ్ ఆఫీసు అనే రెండు ఆప్షన్స్ ఇచ్చారట.. కానీ తాను మాత్రం అదే వేతనం ఇచ్చినా పర్వాలేదు ఆఫీసు నుంచే పనిచేయడానికే అంగీకరించాడట. ఈ విషయం తెలిసి రెడ్డిట్ యూజర్లు.. ‘వీడికేమైనా పిచ్చా’ అని కామెంట్స్ చేస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోంతో లాభాలున్నా.. నష్టాలు కూడా ఉన్నాయి
వర్క్ ఫ్రమ్ హోం వద్దు అని ఆఫీసుకెళ్లి పనిచేయడమే ఉత్తమమని చెప్పిన ఆ ఉద్యోగి తాను తీసుకున్న నిర్ణయం గురించి వివరణ ఇచ్చాడు. “నేను ఆఫీసుకెళ్లి పనిచేయడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్నాను. కానీ నా నిర్ణయాన్ని నా స్నేహితులు విమర్శించారు. నాకు కొత్త కంపెనీలో రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ A: ఫుల్ రిమోట్ టెక్ పొజిషన్. మంచి సాలరీ. అన్ లిమిటెడ్ పిటిఓ (పని పూర్తి చేస్తే ఎన్ని రోజులైనా సెలవు), ఏ సమయంలో నైనా వర్క్ చేసేందుకు అనుమతి. ఎక్కడి నుంచి అయినా పని చేసేందుకు అనుమతి. మరోవైపు ఆప్షన్ B:వారానికి నాలుగు రోజుల్లో ఆఫీసుకెళ్లి పనిచేయడం. అదే సాలరీ, ప్రతి రోజు ఉదయం 9 – సాయంత్రం 5 వరకు ఆఫీసులో పని, స్టాండర్డ్ బెనిఫిట్స్, రాను పోను రోజుకు గంటకు పైగా ప్రయాణం. అయితే నేను మాత్రం ఆప్షన్ B ఎంచుకున్నాను. ఎందుకంేట గత రెండేళ్లుగా క్రమంగా ఇంట్రోవర్ట్ గా మారాను. నేను నా ఇంటికే పరిమితమైపోయాను. నా ఇల్లే నాకు జైలు లాగా అనిపించేది. నేను ఆఫీసులో పనిచేసే సమయంలో బాగుండేది. సరదాగా స్నేహితులతో సమయం గడిపేవాడిది. నాకు పని ఒత్తిడి ఉండే వారితో పంచుకునేవాడిని”. అని రాశాడు.
Also Read: రాత్రి నిద్రపట్టడం లేదా? కమ్మని నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి
ఈ పోస్ట్ చేశాక.. అ ఉద్యోగి తాను తీసుకున్న నిర్ణయం సరైనదే కదా? అని తన స్నేహితులను ప్రశ్నించాడు.”అదే సేమ్ సాలరీకి ఆఫీసుకెళ్లి పనిచేయడమేంటి? రాకపోకలకు పెట్రోల్ ఖర్చు, మధ్యాహ్న భోజనం ఖర్చు అవుతుంది. మరి ఎక్కువ సాలరీ తీసుకోవాలి అని అందరూ నన్ను సూచిస్తున్నారు. కానీ నాకు ఆర్థికంగా కష్టాలు లేవు. నాకు ఆఫీసు కెళ్లి పనిచేస్తేనే మానసిక సంతోషం కలుగుతుంది. నేను నిజంగా తప్పుచేశానా? మీరందరూ దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.” అని తన పోస్ట్ ముగించాడు.
ఈ పోస్ట్‌పై నెటిజెన్లు రియాక్ట్ అయ్యారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. నీ నిర్ణయం నీ వ్యక్తిగతం. నీకు ఏది ముఖ్యమని అనిపిస్తే అదే చేయి. మిగతా వారి అభిప్రాయాలెందుకు అని రాశాడు. ఇంకొకరైతే.. “ఇంట్లోనే బెటర్ కదా బ్రో.. నువ్వు పనిచేసి ఫ్యామిలీతో సరదాగా సమయం గడపవచ్చు.” అని రాశాడు. చివరగా మరో యూజర్ ఇలా రాశాడు.. “హైబ్రిడ్ మాడల్ తీసుకో.. నీవు చెప్పే కారణాలు సబబుగానే ఉన్నాయి. ఆఫీసు నుంచి కొన్ని రోజులు.. ఇంట్లో కొన్ని రోజులు. అదే అన్నింటి కంటే బెటర్” అని కామెంట్ చేశాడు.