BigTV English

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Apple Festival Sale 2024 : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇప్పటికే భారత్ లో దసరా, దివాళీ సేల్ ను ప్రారంభించేశాయి. ఈ సేల్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ తో పాటు ఆపిల్ ప్రొడక్ట్స్ పై సైతం భారీ డిస్కౌంట్ను ప్రకటించాయి. అయితే ప్రస్తుతం ఆపిల్ కంపెనీ స్వయంగా తన దివాళీ సేల్ 2024ను స్టార్ట్ చేసింది.


ఆపిల్ ప్రియలకు గుడ్ న్యూస్. ఎప్పటినుంచే ఎదురు చూస్తున్న ఆపిల్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభమైంది. నేటి నుంచి ఫ్రారంభమైన ఈ సేల్ లో ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది ఆ సంస్థ. ఐఫోన్ తో పాటు మ్యాక్ బుక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ వంటి ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ను అనౌన్స్ చేసింది.

బ్యాంక్ ఆఫర్స్ – ఫెస్టివల్ సేల్ లో అమెరికా ఎక్స్ప్రెస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో లావాదేవీలు చేసే కస్టమర్లకు రూ. 10,000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ కార్డులతో కొనుగోలు చేసేవారు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం పొందే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఆపిల్ వెబ్సైట్ తో పాటు అన్ని ఆపిల్ స్టోర్స్ లో ఈ ఆఫర్స్ కొనసాగుతాయని చెప్పుకొచ్చింది.


ఆఫర్స్ –  ఐఫోన్‌ 16 సిరీస్‌ కొనుగోలుపై రూ.5000 క్యాష్‌బ్యాక్‌, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M3, మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్ పై రూ.10,000, ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 పై రూ.8,000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇక ఈ సేల్ లో ఐప్యాడ్‌ల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతో పాటు ఎయిర్‌పాడ్స్‌పై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఎంపిక చేసిన కొన్ని ప్రొడెెక్ట్స్ పై 3 నెలల పాటు ఆపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను సైతం పొందే అవకాశం ఉంది.

ALSO READ :  3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

వన్ డే ఆఫర్ – సెప్టెంబర్ 4న మాత్రమే స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది ఆపిల్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుపై బీడ్స్ సోలార్ బర్డ్స్(Beats Solo Buds) ప్రత్యేక ఎడిషన్ ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ బర్డ్స్ ఆపిల్ విడుదల చేసిన స్పెషల్ ఇయర్ బర్డ్స్. అద్భుతమైన ఆడియో క్వాలిటీని వీటితో ఆస్వాదించవచ్చు. నిజానికి వీటి ధర రూ. 6,900. ఒకసారి పూర్తి చార్జింగ్ చేస్తే 18 గంటల పాటు వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. మ్యాటీ, బ్లాక్, పర్పుల్,  ట్రాన్స్పరెంట్ వంటి ప్రీమియం కలర్స్ లో వీటిని  రీలీజ్ చేసింది.

సేల్లో ఐఫోన్ 16 తో పాటు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఈఎస్ ఎడిషన్స్ పై స్పెషల్ డిస్కౌంట్ ను అందిస్తోంది. మ్యాక్ బుక్స్ తో పాటు ఐప్యాడ్ 10 జెన్‌, ఐప్యాడ్‌ మిని సహా ఇతర ఐప్యాడ్‌పై క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది.

ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఆపిల్‌ వాచ్‌ అల్ట్రా 2, వాచ్‌ SE2 తో పాటు ఇతర ఉత్పత్తులపై సైతం డిస్కౌంట్స్ పొందవచ్చు. ఎయిర్‌పాడ్స్‌ 4, ఎయిర్‌పాడ్స్‌ ప్రో 2 జెన్, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్ పై సైతం భారీ తగ్గింపును అందిస్తుంది.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×