Apple New Products 2027: టెక్ దిగ్గజం యాపిల్ 2027వ సంవత్సరాన్ని చాలా గ్రాండ్‌గా మొదలుపెట్టబోతోంది. సాధారణంగా ఖరీదైన ప్రీమియం ఫోన్లపై ఎక్కువ ఫోకస్ పెట్టే యాపిల్.. ఈసారి తమ రూట్ మార్చి బడ్జెట్ ధరలో అదిరిపోయే గాడ్జెట్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కొత్త ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో తక్కువ ధరలో ఉండే మోడల్స్‌కు కూడా భారీ అప్‌గ్రేడ్స్ ఇవ్వడం విశేషం.
వచ్చే ఏడాది ఐఓఎస్ 27.4 అప్‌డేట్ విడుదలయ్యే సమయంలో యాపిల్ తమ కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఐఫోన్ 18e, కొత్త బేస్ మోడల్ ఐప్యాడ్, రెండో తరం మ్యాక్‌బుక్ నియో లాంచ్ కానున్నాయి. వీటితో పాటు స్టాండర్డ్ ఐఫోన్ 18, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ కూడా రావచ్చు. అయితే వీటన్నింటినీ ఒకేసారి కాకుండా వేర్వేరు ఈవెంట్లలో పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఈసారి బడ్జెట్ ఫోన్ల విషయంలో యాపిల్ ఎక్కడా తగ్గడం లేదు. ఐఫోన్ 18e, ఐఫోన్ 18 మోడల్స్‌లో శక్తివంతమైన A20 చిప్‌సెట్, 9GB ర్యామ్, మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉండబోతున్నాయి. అలాగే తక్కువ ధరలో వచ్చే ఎంట్రీ లెవల్ ఐప్యాడ్‌లో A19 చిప్‌సెట్ ఇవ్వనున్నారు. దీనివల్ల బడ్జెట్ ఐప్యాడ్‌లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్లు పనిచేస్తాయి. వీటితో పాటు వైఫై 7 సపోర్ట్ చేసే N1 చిప్, సెల్యులార్ మోడల్‌లో C1X మోడెమ్ రానున్నాయి.
Also Read: హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!
కేవలం బడ్జెట్ మోడల్స్ మాత్రమే కాకుండా.. ప్రీమియం సెగ్మెంట్‌లోనూ యాపిల్ సత్తా చూపించనుంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో ఐఫోన్ ఎయిర్ 2, ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ఐప్యాడ్ ఎయిర్, కొత్త ఐప్యాడ్ ప్రో విడుదల కానున్నాయి. ఐఫోన్ ఎయిర్ 2లో అల్ట్రా-వైడ్ కెమెరా, చిన్న డైనమిక్ ఐలాండ్, C2 మోడెమ్ ఉంటాయి. ఇక ఐప్యాడ్ ఎయిర్‌లో M5 చిప్, ఐప్యాడ్ ప్రోలో M6 లేదా M7 చిప్‌తో పాటు మెరుగైన కూలింగ్ సిస్టమ్ ఉండబోతోంది.
కంపెనీ అందిస్తున్న చవకైన ల్యాప్‌టాప్ ‘మ్యాక్‌బుక్ నియో’ సెకండ్ జనరేషన్ మోడల్‌లో పెద్ద మార్పు జరగబోతోంది. J701 కోడ్ నేమ్‌తో వస్తున్న ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో పాత A18 ప్రో బదులు లేటెస్ట్ A19 ప్రో చిప్‌సెట్‌ను వాడుతున్నారు. అంతేకాకుండా.. ర్యామ్‌ను కూడా 8GB నుంచి ఏకంగా 12GBకి పెంచుతున్నారు. దీనివల్ల ల్యాప్‌టాప్ స్పీడ్, గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: 5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!