E-Paper
Advertisement

హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!

హోటల్‌లో అడుగుపెట్టగానే ఈ పని చేయండి.. సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది!
Advertisement

Hidden Camera Detection: సాధారణంగా మనం టూర్లకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా పని మీద వేరే ఊరు వెళ్లినప్పుడు హోటల్స్, హోమ్‌స్టేలు లేదా రెంటల్ అపార్ట్‌మెంట్లలో బస చేస్తుంటాం. కానీ, ఈ మధ్య కాలంలో ప్రైవేట్ గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్న ఘటనలు మనల్ని కాస్త భయపెడుతున్నాయి. అందుకే మన ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలంటే హోటల్ గదిలోకి వెళ్లగానే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఖరీదైన డివైజ్‌లు లేకపోయినా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ సాయంతోనే అనుమానాస్పద కెమెరాలను కొంతవరకు గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

వై-ఫై నెట్‌వర్క్ చెక్ చేయడం:

చాలా వరకు సీక్రెట్ కెమెరాలు లైవ్ రికార్డింగ్ కోసం వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటాయి. మీరు బస చేసిన హోటల్ వై-ఫైకి మీ ఫోన్‌ను కనెక్ట్ చేసి, ఏదైనా నమ్మకమైన నెట్‌వర్క్ స్కానింగ్ యాప్ ద్వారా ఆ నెట్‌వర్క్‌లో ఏయే డివైజ్‌లు కనెక్ట్ అయ్యాయో చూడండి. అందులో టీవీలు, రూటర్లు కాకుండా ఏవైనా తెలియని డివైజ్‌లు కనిపిస్తే కాస్త అప్రమత్తంగా ఉండాలి.

ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో తనిఖీ:

Advertisement

ప్రతి కెమెరా లెన్స్‌కు కాంతిని రిఫ్లెక్ట్ చేసే గుణం ఉంటుంది. ముందుగా రూమ్‌లోని లైట్లన్నీ ఆపేసి పూర్తిగా చీకటి చేయండి. ఆ తర్వాత మీ ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి స్మోక్ డిటెక్టర్లు, గోడ గడియారాలు, డెకరేషన్ వస్తువుల వైపు నెమ్మదిగా లైట్ వేసి చూడండి. ఎక్కడైనా చిన్న మెరుపు లాంటి రిఫ్లెక్షన్ కనిపిస్తే.. అక్కడ కెమెరా ఉండే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.

Also Read: 5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

అనుమానాస్పదంగా కనిపిస్తే:

Advertisement

గదిలోని బెడ్, బాత్రూమ్ లేదా బట్టలు మార్చుకునే చోటుకు ఎదురుగా ఏవైనా వింత ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా అని గమనించండి. గోడలకు చిన్న రంధ్రాలు ఉన్నా, అద్దాల వెనుక ఏదైనా తేడాగా అనిపించినా జాగ్రత్తగా చూడండి. అయితే అనుమానం వచ్చింది కదా అని ఎలక్ట్రిక్ వస్తువులను విరగ్గొట్టడం లాంటి పనులు చేయకండి.

కెమెరా కనిపిస్తే ఏం చేయాలి?

మొబైల్ యాప్స్ వంద శాతం అన్ని కెమెరాలను కనిపెట్టలేవు కాబట్టి.. మన కళ్ళతో కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ మీకు నిజంగానే రహస్య కెమెరా దొరికితే, దాన్ని ముట్టుకోకుండా ఫోటోలు తీసి ఆధారాలు సేకరించండి. వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వండి. అలాగే మీరు రూమ్ బుక్ చేసుకున్న యాప్‌లో కూడా రిపోర్ట్ చేయడం మర్చిపోకండి.

Also Read: గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

Tags

Related News

5G ఫోన్ వాడుతున్నా ఇంకా 4G సిగ్నలే వస్తోందా? ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఏంటీ.. అగ్నిపర్వత విస్ఫోటనాలు.. భూమిని కూల్‌గా ఉంచుతున్నాయా? ఎలాగో తెలిస్తే థ్రిల్ పక్కా!

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?

Big Stories

Advertisement
×