E-Paper
Advertisement

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!

గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!
Advertisement

New IT Rules 2026: మన దైనందిన జీవితంలో సోషల్ మీడియా ఒక భాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చూడనిదే చాలామందికి రోజు గడవదు. అయితే ఇదే సమయంలో అశ్లీల, తప్పుడు సమాచారం, చట్టవిరుద్ధమైన పోస్టులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా భారత్‌లో భారీ ప్రక్షాళన చేపట్టింది. 2026 మొదటి ఆరు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 54 లక్షలకు పైగా పోస్టులు, అకౌంట్లను తొలగించి సంచలనం సృష్టించింది.

భారత్‌లో భారీగా తొలగింపులు..

మెటా పారదర్శకత నివేదిక ప్రకారం.. స్థానిక చట్టాలకు అనుగుణంగా భారత్‌లో పెద్ద సంఖ్యలో కంటెంట్‌ను తొలగించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. 2025లో స్థానిక చట్టాల కింద సుమారు 70 వేల పోస్టులు, అకౌంట్లపై మాత్రమే చర్యలు తీసుకోగా, 2026 తొలి ఆరు నెలల్లో ఈ సంఖ్య 54 లక్షలు దాటింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ..

Advertisement

మెటా తీసుకున్న చర్యల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాటానే ఎక్కువగా ఉంది. ఫేస్‌బుక్‌లో సుమారు 28.22 లక్షల కంటెంట్‌ను తొలగించగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.16 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్నారు. ఇక కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్‌లో కూడా 20 వేలకు పైగా పోస్టులను తొలగించారు. ఈ లెక్కలు చూస్తే సోషల్ మీడియాలో కంటెంట్‌పై మెటా ఎంత నిఘా పెంచిందో అర్థమవుతోంది.

Also Read: వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

కొత్త ఐటీ రూల్స్ ప్రభావం..

Advertisement

భారత్‌లో ఐటీ నిబంధనల్లో చేసిన మార్పులు ఈ చర్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. కొన్ని రకాల చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై సమాచారం లేదా ఆదేశాలు అందిన తర్వాత మూడు గంటల్లోనే చర్యలు తీసుకోవాలి. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ సమయం 36 గంటల వరకు ఉండేది. దీంతో సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి పెరిగింది.

యూజర్లపై ఎలాంటి ప్రభావం?

కొత్త నిబంధనలతో అభ్యంతరకరమైన పోస్టులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే తొలగించిన ప్రతి పోస్టు మెటా దృష్టిలో కూడా తప్పు అని నిర్ధారణ అయినట్టుగా భావించకూడదు. ప్రభుత్వ ఆదేశాలు, స్థానిక చట్టాల ప్రకారం కూడా కంటెంట్ తొలగింపు జరుగుతుంది. ఇకపై సోషల్ మీడియా సంస్థలు భద్రతతో పాటు యూజర్ల భావప్రకటన హక్కులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే.. భారత్‌లో సోషల్ మీడియా నియంత్రణ మరింత కఠినంగా మారుతోంది.

Also Read: కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

Tags

Related News

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?

ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!

జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!

చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!

Big Stories

Advertisement
×