E-Paper
Advertisement

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!
Advertisement

YouTube App Icons: మన ఫోన్ హోమ్ స్క్రీన్ ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అందుకే చాలామంది థీమ్స్, వాల్‌పేపర్స్ మారుస్తుంటారు. కానీ యాప్స్ ఐకాన్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా మనం రోజూ వాడే యూట్యూబ్ యాప్ ఐకాన్ ఏళ్ల తరబడి అదే రెడ్ కలర్ ప్లే బటన్‌తో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ పాత లుక్‌కు చెక్ పెడుతూ.. యూట్యూబ్ ఒక క్రేజీ అప్‌డేట్‌పై పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త యాప్ ఐకాన్ కస్టమైజేషన్ ఫీచర్‌ను యూట్యూబ్ టెస్ట్ చేస్తున్నట్టు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఫీచర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఏడు కొత్త ఐకాన్లు..

ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం.. యూట్యూబ్ బీటా యాప్ వెర్షన్ 21.47.483-BETAలో మొత్తం ఏడు ప్రత్యామ్నాయ ఐకాన్లు కనిపించాయి. వీటిలో మూడు డిజైన్లు అక్టోబర్‌లోనే గుర్తించారు. ప్లే బటన్‌ను నలుపు, తెలుపు రంగుల్లో చూపించే ఐకాన్, కొత్త టెక్స్చర్‌తో కనిపించే డిజైన్, పాత టీవీ స్క్రీన్ ఎఫెక్ట్‌ను గుర్తుచేసే ఐకాన్ ఇందులో ఉన్నాయి. తాజా బీటా వెర్షన్‌లో మరో నాలుగు డిజైన్లు కూడా చేరినట్లు సమాచారం.

పాత యూట్యూబ్ లోగో కూడా..

Advertisement

కొత్తగా వచ్చిన ఐకాన్లలో రెండు డిజైన్లు యూట్యూబ్ పాత రూపాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒక ఐకాన్‌లో పాత లోగో తరహాలో You అనే పదం నలుపు రంగులో, Tube అనే పదం ఎరుపు బాక్స్‌లో తెల్లగా కనిపిస్తుంది. మరో డిజైన్ యూట్యూబ్ ప్రారంభ రోజుల్లో ఐఫోన్ యాప్‌లో ఉపయోగించిన టీవీ ఆకారపు ఐకాన్‌ను పోలి ఉంటుంది. బ్రౌన్ ఫ్రేమ్, ఆకుపచ్చ రంగు స్క్రీన్‌తో ఇది పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మిగిలిన రెండు ఐకాన్లు ప్రస్తుత లోగోకు కొత్త టెక్స్చర్, పెయింట్ స్టాంప్ తరహా రూపాన్ని ఇస్తాయి.

Also Read: ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

సెట్టింగ్స్‌లో కొత్త ఆప్షన్..

Advertisement

ఈ ఐకాన్లను బీటా వెర్షన్‌లో ఇప్పటికే మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చని రిపోర్ట్ చెబుతోంది. అంతేకాదు.. యాప్‌లోని జనరల్ సెట్టింగ్స్‌లో App icon అనే కొత్త ఆప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా కనిపించాయి. దీని ద్వారా యూజర్లు అందుబాటులో ఉన్న డిజైన్లను చూసి, నచ్చిన ఐకాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.

ప్రీమియం యూజర్లకేనా?

ఈ ఫీచర్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం అవుతుందా? లేక ఉచితంగా యాప్ వాడేవారికి కూడా అందుబాటులో ఉంటుందా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి అనే ఆధారాలు కనిపించలేదు. గూగుల్ కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, చివరికి స్టేబుల్ యాప్‌లో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది పరీక్షల దశలోనే ఉంది. యూజర్లకు నచ్చితే భవిష్యత్తులో ఈ చిన్న మార్పు కూడా యూట్యూబ్ అనుభవాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చే అవకాశం ఉంది.

Also Read: వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

Tags

Related News

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?

ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!

జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!

చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!

వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!

Big Stories

Advertisement
×