E-Paper
Advertisement

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!

ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. యాపిల్, శాంసంగ్ ఫోన్లపై రూ.46,000 వరకు తగ్గింపు.. బ్లాక్ ఫ్రైడే సేల్ టాప్-10 డీల్స్ ఇవే!
Advertisement

Black Friday Sale 2026: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బ్లాక్ ఫ్రైడే సేల్ 2026’ ఈ వారాంతంలో అమెరికాలో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ సందర్భంగా యాపిల్, శాంసంగ్, గూగుల్, సోనీ, నథింగ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే కొన్ని క్రేజీ డీల్స్‌ను రివీల్ చేసింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ప్రీమియం ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు:

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. Google Pixel 11 Pro XL అసలు ధర రూ.1,29,000 కాగా, దాదాపు రూ.46,000 తగ్గింపుతో రూ.83,000కే లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన కొత్త Samsung Galaxy Z Fold 8 Ultraపై రూ.32,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీని సేల్ ధర సుమారు రూ.1,80,000గా ఉంది. అలాగే స్టాండర్డ్ Galaxy S26 ఫోన్ రూ.79,000కే అందుబాటులో ఉంది.

బడ్జెట్ రేంజ్‌లో ప్రీమియం ఫోన్లు:

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కావాలనుకునే వారికి Nothing Phone (3), Samsung Galaxy S26 FE బెస్ట్ ఆప్షన్స్. ఈ రెండింటిపై సుమారు రూ.19,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. రూ.65,000 విలువైన ఈ రెండు ఫోన్లను సేల్‌లో భాగంగా రూ.46,000కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ప్రీమియం ఇయర్‌బడ్స్‌పై క్రేజీ డీల్స్:

Advertisement

మ్యూజిక్ లవర్స్ కోసం టాప్ బ్రాండ్ ఇయర్‌బడ్స్ కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. Apple AirPods Pro 3, Samsung Galaxy Buds 4 Pro
అసలు ధరలు రూ.23,000 ఉండగా, ఆఫర్‌లో ఇవి కేవలం రూ.16,600కే లభిస్తున్నాయి. Sony WF-1000XM6 ఇయర్‌బడ్స్ రూ.30,500 నుండి తగ్గి రూ.23,000కే అందుబాటులోకి వచ్చాయి.

ట్యాబ్లెట్లపై రూ.28,000 వరకు ఆదా:

పెద్ద స్క్రీన్ ట్యాబ్లెట్లు కొనాలనుకునే వారికి Samsung Galaxy Tab S11, Lenovo IdeaTab Pro Gen 2 మంచి ఛాయిస్. వీటిపై గరిష్టంగా రూ.28,000 వరకు తగ్గింపు లభిస్తోంది. Samsung Tab S11 రూ.74,000కే దొరుకుతుండగా.. Lenovo Tab కేవలం రూ.34,200కే లభిస్తోంది. డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు చెకౌట్ సమయంలో అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా పొందవచ్చు.

Also Read: ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

Tags

Related News

యూట్యూబ్ పాత రెడ్ లోగోకు గుడ్ బై.. ఇకపై మనకు నచ్చినట్టు యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు!

ఇది కదా వాట్సప్ యూజర్లకు కావాల్సింది.. ఇకపై టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా View-Once ప్రైవసీ!

ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మైక్రోమ్యాక్స్, కార్బన్ రీ-ఎంట్రీ.. చైనా బ్రాండ్ల ఖాళీని భర్తీ చేయగలవా?

ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!

జియో బంపరాఫర్.. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు లాంచ్.. రూ. 15కే అపరిమిత 5G!

చలికాలంలో బట్టలు ఉతకడం కష్టంగా ఉందా? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ 7KG వాషింగ్ మెషీన్లు ఇవే!

వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?

Big Stories

Advertisement
×