BigTV English

Sarath Babu life story : ఆరడుగుల అందగాడు.. రెండు పెళ్లిళ్ల సోగ్గాడు..

Sarath Babu life story : ఆరడుగుల అందగాడు.. రెండు పెళ్లిళ్ల సోగ్గాడు..
Sarath Babu life story


Sarath Babu life story : శరత్ బాబు అసలు పేరు సత్యానారాయణ దీక్షిత్. ఆరడుగుల అందగాడు. తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన శరత్ బాబు.. 1973లో విడుదలైన రామరాజ్యం సినిమాతో హీరోగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌ర్వాత తెలుగు, క‌న్న‌డ‌, తమిళ భాష‌ల్లో 250కిపైగా సినిమాల్లో నటించారు.

సినీ ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తలోనే నటి రమాప్రభతో పరిచయం ఏర్పడింది. అప్పటికీ రమాప్రభ చాలా సీనియర్. ఆమె సినిమాల్లోకి వచ్చిన పదేళ్ల తరువాత శరత్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చాడు. వయసులో శరత్ బాబు కంటే రమాప్రభే పెద్దది. అయినా సరే, ప్రేమ చిగురించడం, పెద్దల సమక్షంలో పెళ్లి జరగడం జరిగిపోయింది. అయితే, వీళ్ల వైవాహిక జీవితం ఏమంత సజావుగా సాగలేదు. 1974లో పెళ్లి చేసుకున్న శరత్ బాబు-రమాప్రభ.. 14 ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజుల నుంచే వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. పిల్లలు కలగలేదు.


శరత్ బాబు-రమాప్రభ మధ్య ఏం గొడవ జరిగిందో కచ్చితమైన కారణాలు ఎవరికీ తెలీదు. కాని, కొన్ని సందర్భాల్లో శరత్‌బాబే డబ్బు కోసం తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది రమాప్రభ. ఇద్దరూ విడిపోయిన తరువాత శరత్ బాబు మరో పెళ్లి చేసుకున్నాడు. కాని, రమాప్రభ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. విజయ చాముండేశ్వరి అనే ఆడపిల్లను దత్తత తీసుకుని, ఆమెను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కి ఇచ్చి పెళ్లి చేసింది.

ఇక శరత్ బాబు.. తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను 1990లో పెళ్లాడారు. ఆమెకు కూడా 2011లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కాకపోతే అది పెళ్లి వరకు వెళ్లలేదు అంటున్నారు.

ఇద్దరితో విడాకులు తీసుకుని మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాడని శరత్ బాబే ఓ సందర్భంలో చెప్పారు. తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు అందరూ కూడా త‌న పిల్లలే అనేది శరత్ బాబు వర్షన్. మొత్తానికి సినిమాల్లో సక్సెస్ అయినా… పర్సనల్ లైఫ్‌ మాత్రం అంత సాఫీగా అయితే సాగలేదు. 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×