BigTV English

Fertiliser Subsidy : ఖరీఫ్ సీజన్.. రైతులకు ఎరువులపై భారీ సబ్సిడీ..

Fertiliser Subsidy : ఖరీఫ్ సీజన్.. రైతులకు ఎరువులపై భారీ సబ్సిడీ..
Fertiliser Subsidy
Fertiliser Subsidy

Fertiliser Subsidy For Kharif Season: ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతులకు కేంద్రం భారీ బొనాంజా ప్రకటించింది. రూ.24,400 కోట్ల ఎరువుల సబ్సిడీని ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం వల్ల రైతులకు అవసరమైన ఎరువులను సబ్సిడీతో పొందే అవకాశం కలుగుతుంది. అన్నదాతలకు ఎరువులు చౌకగా, మరింత సరసమైన ధరలకు లభ్యమవుతాయి.


ఫాస్ఫేటిక్ , పొటాసిక్ ఎరువులపై సబ్సిడీ కోసం రూ.24,420 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2024 ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ పథకానికి 3 కొత్త రకాల ఎరువులను జోడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ పథకం అమలవుతుంది. రైతులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నదే పథకం లక్ష్యం.

ప్రస్తుత అంతర్జాతీయ ధరలు, వాటిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాల ధరల ఆధారంగా ప్రభుత్వం పీ అండ్ కే ఎరువులకు సబ్సిడీ రేట్లను కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా సబ్సిడీ రేట్లు న్యాయబద్ధంగా ఉంటాయని భావిస్తోంది.  వాస్తవ ఖర్చులను ప్రతిబింబించే ఉండాలన్నదే ధ్యేయం.


Read More: బిల్.. మీ సేవలు అద్భుతం: మోదీ

రైతులకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతోనే సబ్సిడీ పథకంలో 3 కొత్త రకాల ఎరువులను చేర్చారు.  ఈ ఎరువులు నేల సారాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రైతులు వారి భూమి అవసరమైన ఎరువులను ఎంచుకునే అవకాశం కలుగుతుంది.

రైతులు 2024 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువుల కోసం సబ్సిడీ ధరలను పొందవచ్చు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 వరకు సబ్సిడీపై ఎరువులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల రైతులు ఖర్చు గురించి పెద్దగా ఆందోళన చెందకుండా తమకు అవసరమైన సమయంలోనే ఎరువులను సులభంగా పొందగలుగుతారు.

మొత్తం 25 రకాల ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులను రైతులకు సబ్సిడీ ధరలకు కేంద్రం అందుబాటులో ఉంచుతుంది.  పంట ఉత్పత్తిని పెంచడం , రైతులకు మద్దతు ఇవ్వడం,  వారి ఆదాయాన్ని పెంచడం ఎరువుల సబ్సిడీ పథకం లక్ష్యాలుగా కేంద్రం పేర్కొంది.

Tags

Related News

Shubhanshu Shukla: మోడీని కలిసిన శుభాంసు శుక్లా.. ప్రధాని కోసం అంతరిక్షం నుంచి ఏం తెచ్చాడో తెలుసా?

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Big Stories

×