Motorola Moto G06 Discount| మంచి క్వాలిటీ, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లకు అందుబాటు ధరలకు అందించడంలో మోటోరోలా బ్రాండ్ ఫేమస్. తాజాగా దీపావళి సేల్ మోటోరోలా తన లేటెస్ట్ ఫోన్ల ధరలకు తగ్గించింది. ఇటీవలే విడుదలైన మోటో G06 పవర్ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు ఆఫర్‌లో లభిస్తోంది. ఈ ఫోన్‌లో 7000mAh పెద్ద బ్యాటరీ ఉండడం ప్రత్యేకం. ఫ్లిప్‌కార్ట్ దీపావళి బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లున్న ఫోన్ కోసం వెతికే వారికి ఇది అద్భుతమైన డీల్.
ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ.7,499 ధరకు సేల్ లో అందుబాటులో ఉంది. ఇంకా రూ.300 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే చివరి ఎఫెక్టివ్ ధర రూ.7,199 మాత్రమే. మరిన్ని డిస్కౌంట్‌ల కోసం ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి రూ.5,450 వరకు సేవ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉపయోగించి మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ బెస్ట్ డీల్‌తో ఫోన్ చాలా చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 6.88 ఇంచ్ HD+ పెద్ద డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రాలింగ్, యానిమేషన్‌లు చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. మీడియాటెక్ హెలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రోజువారీ పనులు సులభంగా జరుగుతాయి. ఎంటర్‌టైన్‌మెంట్, బ్రౌజింగ్ వంటివి మంచి స్పీడ్‌తో రన్ అవుతాయి. ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 (మోటోరోలా మై UX) వెర్షన్‌తో వస్తుంది. దీంతో యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సులభంగా.. కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 7000mAh పెద్ద బ్యాటరీ. ఒక్క సారి ఫుల్ చార్జ్‌తో 2-3 రోజులు సులభంగా పనిచేస్తుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా పవర్ అప్ చేయవచ్చు. రియర్ కెమెరాలో 50MP మెయిన్ సెన్సార్, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు సరిపోతుంది. స్టోరేజ్ మైక్రోSD కార్డ్‌తో 1TB వరకు పెంచుకోవచ్చు.
ఫోన్‌లో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్. డాల్బీ ఆటమాస్ స్టిరియో సౌండ్‌తో మ్యూజిక్, మూవీలు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ధరకు ఈ ఫోన్ మంచి వాల్యూ ఫర్ మనీ. బ్యాటరీ లైఫ్, పెర్ఫామెన్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
మోటో G06 పవర్‌తో పాటు, దీపావళి సేల్‌లో మరిన్ని మోటోరోలా ఫోన్‌లు ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ మోడల్స్ పై కూడా తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు ఉపయోగించి తక్షణ డిస్కౌంట్స్ పొందవచ్చు. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, ఇప్పుడే చూడండి. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఎక్సైటింగ్ డీల్స్ చెక్ చేయండి.
మోటో G06 పవర్ ఇప్పుడు స్టీల్ డీల్. ధర చాలా తగ్గి ఆకర్షణీయంగా మారింది. పెద్ద బ్యాటరీ దీని మెయిన్ సెల్లింగ్ పాయింట్. మంచి కెమెరా, స్మూత్ డిస్‌ప్లే కూడా ఆకర్షణీయం. ఈ లిమిటెడ్ టైమ్ ఫెస్టివల్ ఆఫర్ మిస్ కాకండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫోన్ కొని ఎంజాయ్ చేయండి!
Also Read: మొబైల్ గేమ్స్ ఆడుతూ చనిపోతున్న టీనేజర్లు.. ఏం జరుగుతోందంటే..