Vivo X200 Alternatives| 2025లో గొప్ప కెమెరా గల ఫోన్లలో ఇప్పటివరకు వివో X200 ప్రో బాగా ఫేమస్ అయింది. అయితే, ఈ ఫోన్‌కు గట్టి పోటీనిచ్చే ఇతర ఫోన్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఫోటో క్వాలిటీ, రంగుల క్లారిటీ, మొత్తం కెమెరా పనితీరులో వివో X200 ప్రోతో సమానంగా నిలుస్తాయి. ఈ ఫోన్‌లు అధునాతన ఫీచర్లు, ప్రొఫెషనల్ స్థాయి ఫలితాలను అందిస్తాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఐఫోన్ 16లో 6.1 ఇంచ్‌ల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది, ఇది డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ శక్తివంతమైన ఆపిల్ A18 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వివో X200 ప్రోతో సమానమైన అద్భుతమైన ఫోటో ఎక్స్‌పీరియన్స అందిస్తాయి, ముఖ్యంగా రంగులు, లైటింగ్, ఇతర చిన్న చిన్న డిటైల్స్ అన్నీ స్పష్టంగా ఉంటాయి.
షావోమీ 15లో 6.36 ఇంచ్‌ల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఈ ఫోన్‌కు శక్తినిస్తుంది. ఇందులో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వివో X200 ప్రో లాంటి రంగుల స్పష్టత, వివరాలను అందిస్తాయి, ఫోటోలు సహజంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఒక ఫోల్డబుల్ 7.0 ఇంచ్‌ల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు స్పష్టమైన, ప్రకాశవంతమైన ఫోటోలను సులభంగా తీయడానికి సహాయపడతాయి, వివో X200 ప్రోకు గట్టి పోటీనిస్తాయి.
గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో 6.3 ఇంచ్‌ల సూపర్ యాక్చువా డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ఈ ఫోన్‌ను నడిపిస్తుంది. ఇందులో 50MP + 48MP + 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 42MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వివో X200 ప్రోకు సమానమైన అద్భుతమైన ఫోటో నాణ్యతను అందిస్తాయి, ముఖ్యంగా AI-ఆధారిత ఫీచర్లతో.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 ప్లస్‌లో 6.7 ఇంచ్‌ల డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 50MP + 10MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వివో X200 ప్రో లాంటి అద్భుతమైన పనితీరును అందిస్తాయి.
ఒప్పో ఫైండ్ X8 ప్రోలో 6.78 ఇంచ్‌ల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 50MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వివో X200 ప్రో లాంటి ప్రకాశవంతమైన, స్పష్టమైన ఫోటోలను అందిస్తాయి.
ఈ ఆరు స్మార్ట్‌ఫోన్‌లు వివో X200 ప్రోకు గట్టి పోటీనిస్తూ, అద్భుతమైన కెమెరా క్వాలిటీ, ఫీచర్లతో ఫోటోగ్రఫీ ప్రియులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ ఆప్షన్లు.
Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?