BigTV English

Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!

Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!

Star Hero: సినీ షూటింగ్ సెట్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం సాధారణ పరిస్థితిగా మారిపోయింది. ముఖ్యంగా అనుకొని సంఘటనల కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఇప్పుడు ఏకంగా 120 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో ఇలా అస్వస్థతకు గురికావడంతో చిత్ర బృందం మొత్తం ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఆ హీరో ఎవరు? ఏ సినిమా షూటింగ్ సెట్లో ఇలా జరిగింది? అసలేమైంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


‘ధురంధర్’ సినిమా షూటింగ్ సెట్ లో 120 మందికి అస్వస్థత..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh).తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధురంధర్’. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో ఫుట్ పాయిజనింగ్ జరిగి, దాదాపు 120 మందికి పైగా కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లద్దాక్ లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది. దాదాపు 600 మంది సిబ్బంది ఆదివారం రాత్రి డిన్నర్ చేశారు. అయితే తిన్న వెంటనే అందులో కొంతమందికి విరోచనాలు, వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.


వైద్యులు ఏమన్నారంటే?

ఇకపోతే వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం.. సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేస్ గా గుర్తించారు. దీనిపై డాక్టర్లు స్పందిస్తూ.. కొంతమందికి తీవ్రమైన డీహైడ్రేషన్ వచ్చింది. మరి కొంతమందికి కడుపునొప్పి, వాంతులు, తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటెరిటిస్, తలనొప్పి ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇకపోతే విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ధురంధర్..

ధురంధర్ సినిమా విషయానికి వస్తే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్ , ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 1970 – 80 మధ్యకాలంలో భారత నిఘా సంస్థ నిర్వహించిన నిజమైన రహస్య కార్యకలాపాల నుండి ప్రేరణ పొందిందని చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే.. ఇందులో రణవీర్ సింగ్ ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తారని సమాచారం. ఇకపోతే ఈ ఏడాది జూలై 6వ తేదీన రణబీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ టీజర్ ని విడుదల చేసిన మేకర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య టీజర్ తోనే హైప్ పెంచేసిన చిత్ర బృందం.. ఇప్పుడు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.

ALSO READ:Bollywood: 3 ఇడియట్స్ నటుడు కన్నుమూత.. కారణం ఏంటంటే?

Related News

Manushi Chillar: సెలైన్ బాటిల్ తో కనిపించిన మానుషీ చిల్లర్.. ఏమైందంటూ ఫాన్స్ ఆందోళన!

ViswakSen : ఫిలింనగర్ లో వావన్ జ్యువెలరీని ప్రారంభించిన హీరో విశ్వక్ సేన్..

Bollywood: 3 ఇడియట్స్ నటుడు కన్నుమూత.. కారణం ఏంటంటే?

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

Big Stories

×