E-Paper
Advertisement

రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!

రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!
Advertisement

Best Fast Charging Phones: ఫోన్ కొనేటప్పుడు కెమెరా, ప్రాసెసర్ ఎంత బాగున్నాయో చూడటంతో పాటు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, ఛార్జింగ్ ఎంత వేగంగా అవుతుంది అనేవి కూడా గమనించాలి. ముఖ్యంగా ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. అయితే భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.30,000 లోపు బడ్జెట్‌లోనే ఇలాంటి ఫీచర్లతో పాటు స్మూత్ డిస్‌ప్లే, మంచి పనితీరు అందించే ఫోన్లు ఉన్నాయి. మరి ఈ ధరలో అందుబాటులో ఉన్న టాప్-5 ఫోన్లు ఏవి? వాటి ప్రత్యేకతలు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..

iQOO Z11xa 5G

గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. రూ.28,998 ధరలో లభించే ఈ ఫోన్‌లో ఏకంగా 7,200mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి తోడు 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ తొందరగా ఛార్జ్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో పాటు మోన్‌స్టర్ మోడ్, 4D గేమ్ వైబ్రేషన్ వంటి గేమింగ్ ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వడం విశేషం.

Redmi Note 17 5G

Advertisement

రూ.27,999 ధరలో లభించే ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీనిలో 8,000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఉన్న రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా అవసరమైతే వేరే డివైజ్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్, 6.99 అంగుళాల పెద్ద అమోలెడ్ డిస్‌ప్లేతో సినిమాలు చూసేందుకు, రోజంతా వాడేందుకు ఇది చాలా బాగుంటుంది.

Also Read: అమ్మ బాబోయ్.. రూ.1.30 లక్షల విలువైన స్మార్ట్ టీవీ జస్ట్ రూ.64 వేలకే వచ్చేస్తోంది!

OnePlus Nord CE6 Lite

Advertisement

స్పీడ్, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి రూ.26,499 ధరలో లభించే ఈ వన్‌ప్లస్ ఫోన్ మంచి ఛాయిస్. ఇందులో 7,000mAh బ్యాటరీకి తోడు 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే దీని సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గేమింగ్ సమయంలో వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు.

Motorola Edge 60 Fusion

ట్రెండీ లుక్, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వారికి రూ.28,399 ధరలో ఈ మోటరోలా ఫోన్ బాగా సెట్ అవుతంది. ఇందులో గేమింగ్ ఫీచర్లు ఎక్కువగా లేకపోయినా.. కర్వ్డ్ డిజైన్, ప్రీమియం లుక్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉండటం వల్ల ఎలాంటి లాగ్ సమస్యలు లేకుండా చాలా ఫ్రీగా వాడొచ్చు. ఎలాంటి అనవసరమైన యాప్స్ లేకుండా సింపుల్ అండ్‌రాయిడ్ అనుభవం కావాలనుకునేవారికి ఇది బెస్ట్ సెలక్షన్.

realme NARZO 100x 5G

ఎక్కువ రోజులు బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునేవారికి రూ.27,999 ధరలోని ఈ రియల్ మీ ఫోన్ పర్ఫెక్ట్. ఇందులో కూడా 8,000mAh బ్యాటరీ ఉండటంతో సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 3 రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు -20°C నుంచి 56°C వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. మంచి బ్యాటరీ లైఫ్, గేమింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Also Read: అమెజాన్ రీలోడెడ్ సేల్.. రూ.699కే బ్రాండెడ్ పవర్ బ్యాంక్.. మిస్ అయితే ఫీలవుతారు మామా!

Tags

Related News

శాంసంగ్,ఇతర బ్రాండ్లు మళ్లీ 4G ఫోన్‌లను మార్కెట్‌లోకి ఎందుకు తెస్తున్నాయి?

స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయా? లేక టెన్షన్ పెంచుతున్నాయా?

తక్కువ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా?Haier vs Samsung ఫ్రిజ్ ధరలు,ఆఫర్లు!

చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!

కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా?ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

Big Stories

Advertisement
×