Intex Geysers: శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త వాటర్ హీటర్ల (గీజర్లు) సిరీస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. హోమ్ అప్లయన్సెస్ విభాగంలో తన ఉనికిని మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా ఇంటెక్స్ తొలిసారి వాటర్ హీటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇంటెక్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో ఇన్‌స్టాంట్, స్టోరేజ్ విభాగాలకు చెందిన వివిధ రకాల సిరీస్‌లు ఉన్నాయి. ఇన్‌స్టాంట్ మోడళ్ల కింద ఇన్‌స్టి (Insti), ఫెర్రో (Ferro) సిరీస్‌లను విడుదల చేయగా.. స్టోరేజ్ మోడళ్ల కోసం ఆక్వా స్ప్లాష్ (Aqua Splash), ఫ్రెష్ వేవ్ (Fresh Wave), ఆక్వా లక్స్ (Aqua Luxe), హాట్జీ (Hotzy) సిరీస్‌లను అందుబాటులోకి తెచ్చారు.
సామర్థ్యం విషయానికి వస్తే ఇన్‌స్టాంట్ వాటర్ హీటర్లు 3 లీటర్లు, 5.9 లీటర్ల వేరియంట్లలో లభిస్తున్నాయి. అలాగే స్టోరేజ్ మోడళ్లు 10 లీటర్లు, 15 లీటర్లు, 25 లీటర్ల కెపాసిటీలలో లభిస్తాయి. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని ఇంటెక్స్ కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త వాటర్ హీటర్లలో తుప్పు పట్టకుండా నిరోధించే అల్ట్రా-డైమండ్ గ్లాస్‌లైన్ ట్యాంక్ (Ultra-Diamond Glassline tank) ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. లోపలి ట్యాంక్ మన్నికను పెంచడానికి మ్యాగ్నీషియం యానోడ్ రాడ్‌ను అందించినట్లు తెలిపింది. లోపల ఉండే వేడి నీరు ఎక్కువ సమయం వేడిగా ఉండేలా, వేడి వృథా కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఇన్సులేషన్‌ను రూపొందించినట్లు ఇంటెక్స్ వర్గాలు తెలిపాయి.
Also Read: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు.. 46 మంది మృత్యువాత!
ఈ గీజర్లు 8 బార్ల వరకు నీటి ఒత్తిడిని తట్టుకోగలవని కంపెనీ తెలిపింది. దీనివల్ల హైరైజ్ అపార్ట్‌మెంట్లు, ప్రెజర్ పంపులు ఉపయోగించే ఇళ్లకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. అటు వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ వీటిని షాక్ ప్రూఫ్ (Shock-proof) బాడీతో తీర్చిదిద్దినట్లు తెలిపింది. వీటితో పాటు ప్రెజర్ రిలీఫ్ అండ్ మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్‌లు, థర్మల్ కటాఫ్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఇంటెక్స్ ఈ కొత్త గీజర్లలో అందించింది. ఇక డిజైన్ విషయానికి వస్తే.. వీటి స్టైలిష్ లుక్ బాత్రూమ్ కు లగ్జరీ లుక్ అందిస్తాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంటెక్స్ హీటర్ల ప్రారంభ ధరను రూ.5,290గా నిర్ణయించారు. హీటర్ సామర్థ్యాన్ని ధర మారనుంది.
Also Read: ప్రజలకు విజయ్ ప్రభుత్వం బిగ్ షాక్.. ఆటో ఛార్జీలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచుతూ నిర్ణయం!