Why Wi-Fi is slow on some phones: మనలో చాలామంది ఇంట్లో లేదా ఆఫీస్‌లో వై-ఫై కనెక్షన్ తీసుకుంటాం. అందరూ ఒకే రూమ్‌లో, ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటారు. కానీ కొందరి మొబైల్స్ లో వీడియోలు ఎలాంటి బఫరింగ్ లేకుండా ప్లే అవుతుంటే.. పక్కనే ఉన్న మరో ఫోన్‌లో మాత్రం వీడియో తిరుగుతూనే ఉంటుంది. “నా ఫోనే బాగోలేదేమో” అని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వెనక కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న దాదాపు అన్ని మోడరన్ రూటర్లు డ్యుయల్ బ్యాండ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. అవే 2.4GHz, 5GHz బ్యాండ్స్. మీ రూటర్ ఖరీదు రూ. 1,500 నుంచి రూ. 3,000 వరకు ఉంటుంది. అయితే.. ఇందులో కొన్ని ఫోన్లు కేవలం 2.4GHz కి మాత్రమే కనెక్ట్ అవుతాయి. ఇది నెమ్మదిగా ఉంటుంది కానీ ఎక్కువ దూరం సిగ్నల్ ఇస్తుంది. మరోవైపు..ప్రీమియం లేదా కొత్త ఫోన్లు 5GHz బ్యాండ్‌కు కనెక్ట్ అవుతాయి. దీని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరు 2.4GHz కి, మరొకరు 5GHz కి కనెక్ట్ అయితే ఇద్దరి ఫోన్ల స్పీడ్‌లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది.
ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను హ్యాండిల్ చేయడానికి Wi-Fi Chipset ఉంటుంది. అలాగే ఫోన్ తయారీలో వాడే టెక్నాలజీని బట్టి Wi-Fi 4, Wi-Fi 5 లేదా లేటెస్ట్ Wi-Fi 6 / Wi-Fi 6E సపోర్ట్ ఉంటుంది. ఉదాహరణకు..మీ పాత ఫోన్‌లో Wi-Fi 4 లేదా చిప్ ఉంటే, అది రూటర్ అందించే హై-స్పీడ్ డేటాను పూర్తిగా రిసీవ్ చేసుకోలేదు. అదే కొత్త తరం రూటర్ (ధర రూ.2,000 రూ.5,000 మధ్య ఉండేవి), లేటెస్ట్ వై-ఫై 6 సపోర్ట్ ఉన్న ఫోన్ అయితే ..డేటాను క్షణాల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకే.. ఫోన్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను బట్టి కూడా స్పీడ్ మారుతుంది.
మనం వాడే మొబైల్ కవర్స్ కూడా వై-ఫై స్పీడ్‌పై ప్రభావం చూపుతాయి. మొబైల్ తయారీదారులు ఫోన్ లోపల ఇంటర్నల్ వై-ఫై యాంటెన్నాను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. కొన్ని బ్రాండెడ్ లేదా ప్రీమియం ఫోన్లలో (ధర రూ. 20,000 పైబడినవి) మల్టిపుల్ యాంటెన్నా టెక్నాలజీ ఉంటుంది. అంతేకాకుండా.. మనం ఫోన్‌కి వాడే కొన్ని రకాల మందపాటి లోహపు లేదా మందమైన రబ్బరు కవర్లు వై-ఫై సిగ్నల్స్‌ను అడ్డుకుంటాయి. దీని వల్ల పక్కనే ఉన్నా సిగ్నల్ రిసెప్షన్ తగ్గిపోయి నెట్ స్లో అవుతుంది.
ఒకే రూమ్‌లో ఉన్నప్పటికీ, ఒక ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద సైజ్ యాప్స్ అప్‌డేట్ అవుతుండటం లేదా ఫోటోలు క్లౌడ్‌లోకి.. బ్యాకప్ అవుతుండటం జరుగుతుంటుంది. దీని వల్ల రూటర్ అందించే బ్యాండ్‌విడ్త్ ఆ ఫోన్ ఎక్కువగా లాగేసుకుంటుంది. ఫలితంగా అదే రూమ్‌లో ఉన్న మరో ఫోన్‌కు ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా అందక నెమ్మదిగా మారుతుంది.
Also Read: ఫోన్ హ్యాంగ్ అవుతోందా?ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో రాకెట్ లా దూసుకెళ్తుంది
మీ రూటర్‌ని ఇంటి మధ్యలో.. ఎవరికీ అడ్డులేకుండా ఓపెన్ ప్లేస్‌లో ఉంచండి (మంచి రూటర్ ధర మార్కెట్లో రూ.1,800 నుంచి ప్రారంభమవుతుంది).
మీ ఫోన్ వై-ఫై సెట్టింగ్స్‌లో వీలైతే 5GHz నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి.
ఫోన్‌కు అనవసరమైన.. మందపాటి మెటల్ కవర్లను వాడటం మానేయండి.
ఈ చిన్న చిన్న టెక్నికల్ విషయాలను సరిచేసుకుంటే.. ఒకే గదిలో ఉన్న అన్ని ఫోన్లలోనూ ఒకేలాంటి సూపర్ ఫాస్ట్ వై-ఫై స్పీడ్‌ను పొందొచ్చు!