Best air purifier buying guide 2026: ఈ రోజుల్లో చలికాలం వచ్చిందంటే చాలు, నగరాల్లో కాలుష్యం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోకి కూడా దుమ్ము, ధూళి, పొగ రాకుండా ఉండేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఒక అత్యవసర గాడ్జెట్‌గా మారిపోయాయి. మార్కెట్లో రూ.7,000 నుంచి రూ. 25,000, అంతకంటే ఎక్కువ ధరల్లో వివిధ రకాల బ్రాండ్ల ప్యూరిఫైయర్లు లభిస్తున్నాయి. అయితే సరైన అవగాహన లేకుండా వీటిని కొంటే.. అసలు ప్రయోజనం ఉండదు. ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఆరు ముఖ్యమైన అంశాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్ ప్యూరిఫైయర్‌లో అతి ముఖ్యమైన భాగం ఫిల్టర్. మార్కెట్లో చాలా తక్కువ ధరకే.. దొరికే ప్యూరిఫైయర్లు సాధారణ నైలాన్ ఫిల్టర్లతో వస్తాయి. కానీ.. ఇవి కేవలం పెద్ద ధూళి కణాలను మాత్రమే ఆపుతాయి. గాలిలో.. ఉండే అత్యంత సూక్ష్మమైన PM2.5, PM10 కణాలను తొలగించాలంటే.. ‘True HEPA Filter'(H13 గ్రేడ్) ఉన్న మోడల్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఇది 99.97% సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, దుమ్మును సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
మీ రూమ్ సైజ్ బట్టి ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవాలి. చిన్న బెడ్ రూమ్ అయితే.. 150-200 sq ft సరి పోతుంది. పెద్ద హాల్ అయితే.. 400-500 sq ft కెపాసిటీ ఉన్నది కావాలి. దీని కోసం CADR రేటింగ్‌ను పరిశీలించాలి.CADR రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే.. గదిలోని గాలి అంత వేగంగా శుభ్రపడుతుంది. సరైన కెపాసిటీ లేని ప్యూరిఫైయర్ కొంటే.. గాలి శుభ్రం కావడానికి గంటల తరబడి సమయం పడుతుంది.
కేవలం డస్ట్ మాత్రమే కాకుండా.. ఇంట్లో వంట చేసేటప్పుడు.. వచ్చే వాసనలు, సిగరెట్ పొగ, పెట్స్ (పెంపుడు జంతువులు) వల్ల వచ్చే దుర్వాసన, రసాయనిక వాయువులను తొలగించడంలో యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అద్భుతంగా పని చేస్తుంది. మీరు కొనే ప్యూరిఫైయర్‌లో HEPA తో పాటు కార్బన్ ఫిల్టర్ కూడా ఉండేలా చూసుకోండి.
చాలా మంది ప్యూరిఫైయర్ అసలు ధరను.. చూసి కొనేస్తారు. కానీ అసలు ఖర్చు ఆ తర్వాతే మొదలవుతుంది! ప్యూరిఫైయర్ ఫిల్టర్లు సాధారణంగా 6 నుంచి 12 నెలలకోసారి మార్చాల్సి వస్తుంది. కొత్త ఫిల్టర్ ధర రూ. 1,500 నుంచి రూ. 4,000 వరకు ఉంటుంది. కొనేముందు ఆ బ్రాండ్ ఫిల్టర్లు మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయా, వాటి ధర ఎంత అనే విషయం ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎయిర్ ప్యూరిఫైయర్ రాత్రి పూట బెడ్ రూమ్‌లో ఆన్ చేసి పడుకోవాల్సి ఉంటుంది. అది రన్ అవుతున్నప్పుడు విపరీతమైన సౌండ్ వస్తే నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. కొనేముందు ఆ మోడల్ స్లీప్ మోడ్ కలిగి ఉందా లేదా, దాని నాయిస్ లెవెల్ 20 నుంచి 30 డెసిబెల్స్ లోపు ఉందా లేదా అని చెక్ చేయాలి. నిశ్శబ్దంగా పని చేసే మోడల్స్ మాత్రమే రాత్రివేళల్లో సౌకర్యంగా ఉంటాయి.
Also Read: పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా డిజిటల్ డిస్‌ప్లే, AQI ఇండికేటర్,మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉన్న మోడళ్లను ఎంచుకోవడం మంచిది. దీని వల్ల మీ ఇంట్లోని గాలి క్వాలిటీ ఎప్పటికప్పుడు ఎలా ఉందో డిస్‌ప్లేపై స్పష్టంగా కనిపిస్తుంది.
మార్కెట్లో బేసిక్ మోడల్స్ (Xiaomi, Kent, Eureka Forbes వంటివి) రూ.7,000 నుంచి రూ.10,000 ధరలో లభిస్తుండగా, ప్రీమియం ఫీచర్లు, పెద్ద రూమ్ సైజ్ కలిగిన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు రూ. 12,000 నుంచి రూ. 22,000 వరకు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ,అవసరానికి తగ్గ సరైన మోడల్‌ను ఎంచుకోండి. ఈ 6 విషయాలు గుర్తుంచుకుంటే.. మీరు కొనే ప్యూరిఫైయర్ గురించి ఎప్పటికీ పశ్చాత్తాపపడరు!