E-Paper
Advertisement

స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయా? లేక టెన్షన్ పెంచుతున్నాయా?

స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయా? లేక టెన్షన్ పెంచుతున్నాయా?
Advertisement

Smartwatch Health Tracking: నేటి ఆధునిక యుగంలో చేతికి స్మార్ట్‌వాచ్ లేని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్ని అడుగులు వేశాం, గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది, ఎన్ని గంటలు నిద్రపోయాం వంటి లెక్కలన్నీ స్మార్ట్‌వాచ్‌లోనే చూసుకోవచ్చు. అయితే ఈ వాచ్‌లు మనల్ని కాస్త యాక్టివ్‌గా ఉంచడానికి, ఆరోగ్యపు అలవాట్లు మార్చుకోవడానికి బాగానే సాయపడుతున్నాయి. కానీ, ఇవే అన్నీ అనుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేస్తే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

ఏది పడితే అది నమ్మకూడదు:

మార్కెట్లో దొరికే వాచ్‌లు అన్నీ ఒకేలా పనిచేయవు. స్టెప్స్ కౌంట్, గుండె కొట్టుకునే వేగం, నిద్ర సమయం లాంటివి ఇవి మోస్తరుగా బాగానే ట్రాక్ చేస్తాయి. అయితే, వీటిలో ఏది పడితే అది చూసి అనవసరంగా భయపడిపోవద్దు. ఎందుకంటే.. ఇవి ఇచ్చే ప్రతి రిపోర్ట్ వంద శాతం కరెక్ట్ అని గ్యారంటీ లేదు. వీటిని కేవలం మన ఆరోగ్యంపై మనకు ఒక అవగాహన రావడానికి మాత్రమే వాడుకోవాలి తప్ప, ఎంబీబీఎస్ డాక్టర్‌లా నమ్మకూడదు.

Advertisement

Also Read: రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!

గుండె చప్పుడుపై నిఘా:

కొన్ని ఖరీదైన వాచ్‌లకు గుండె లయ తప్పుతున్నట్లు (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) గుర్తించే పవర్ ఉంటుంది. ఇది పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడంలో కాస్త సాయపడుతుంది. వాచ్‌లో ఏదైనా హెచ్చరిక వస్తే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సిందే. అంతేగానీ, వాచ్‌లో నార్మల్ అని వచ్చిందని మనకు ఏ రోగమూ లేదని నిర్ధారించుకోకండి. అలాగే, రక్తంపోటు, షుగర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలను ఇవి అసలు కనిపెట్టలేవు.

టెన్షన్‌కు దూరంగా ఉండటం:

Advertisement

ఎప్పుడూ చేతి వాచ్ వైపు చూస్తూ.. నిద్ర తక్కువైందని, హార్ట్ బీట్ పెరిగిందని రోజంతా టెన్షన్ పడేవాళ్లు కోకొల్లలు. చిన్న చిన్న హెచ్చుతగ్గులకే భయపడితే లేనిపోని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. కేవలం నడకను పెంచుకోవడానికి, నిద్ర వేళలను సరిచేసుకోవడానికి మాత్రమే దీన్ని వాడుకోవాలి. వీటికి బానిసలైతే సోషల్ మీడియా వ్యసనానికి మారినట్టే అవుతుంది.

డేటా భద్రత ఎంతవరకు ముఖ్యం?

మనం వాడే యాప్స్ మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రైవేట్ సమాచారాన్ని సేకరిస్తుంటాయి. ఈ డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే దానిపై కచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. ప్రైవసీ పాలసీలు సరిగ్గా చూసుకోకుండా అన్ని పర్మిషన్లు ఇవ్వడం మంచిది కాదు. మొత్తానికి స్మార్ట్‌వాచ్ అనేది మనల్ని నడిపించే లీడర్ కాదు, మనకు దారి చూపే ఒక చిన్న టూల్ మాత్రమే అని గుర్తుంచుకోండి. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే గడియారం కేసి చూడటం మానేసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్లడమే ఉత్తమం.

Also Read: రూ.1.75 లక్షల శాంసంగ్ ఫోన్ ఇంత చౌకగానా? రూ.45 వేల డిస్కౌంట్‌తో అదిరిపోయే డీల్!

Tags

Related News

బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా?ఈ 5 పనులు ఈరోజే చేయండి!

ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్లు..రూ.30వేల కంటే తక్కువ ధరకే ప్రీమియం ఫోన్‌లు!

షాకింగ్.. నవంబర్ 15 నుంచి ఆ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!

శాంసంగ్,ఇతర బ్రాండ్లు మళ్లీ 4G ఫోన్‌లను మార్కెట్‌లోకి ఎందుకు తెస్తున్నాయి?

రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!

తక్కువ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా?Haier vs Samsung ఫ్రిజ్ ధరలు,ఆఫర్లు!

చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!

Big Stories

Advertisement
×