Intinti Ramayanam Pallavi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ చానల్లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ వచ్చింది. కొన్ని సీరియల్స్ ఏకంగా టాక్ ఆఫ్ ది వీక్ గా నిలిచిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అలాంటి వాటిలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ప్రతి కుటుంబంలో ఉండే కథతో రూపొందిన స్టోరీ. ఇందులో హీరోయిన్ గా ఉన్న అవని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని విలన్ గా ఉన్న పల్లవి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఆ పల్లవి క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.. ఇప్పటివరకు వచ్చిన వార్తల కంటే ఇప్పుడు తాజాగా పల్లవి షేర్ చేసిన ఒక వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇంతకీ పల్లవి ఏం వీడియో పోస్ట్ చేసింది..? అందులో ఏముంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవి పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అసలు పేరు యశస్విని గౌడ.. ఈమె కర్ణాటకకి చెందిన ముద్దుగుమ్మ. కన్నడలో పలు సీరియల్స్ సినిమాలతో బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పల్లవి పేరు తెలుగు ప్రేక్షకులను ఆలోచనలో పడేలా చేస్తూ ఉంటుంది. పల్లవి తన సోషల్ మీడియాలో తన గురించి అన్ని విషయాలలో షేర్ చేసుకుంటుంది.. అలాగే తనకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఆ వీడియోలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. తను ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ లో చిల్ అవుతున్న వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పల్లవి తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ వేస్తూ ఉన్న వీడియో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి..
?cplk=MThwNzBld2x4ZDFvOQ==
ఇంటింటి రామాయణం సీరియల్ విషయానికి వస్తే.. ఈ సీరియల్ లో కమల్ పల్లవికి విడాకులు నోటీసు పంపిస్తాడు అంటే ఇక కమల్ పల్లవిని మళ్ళీ ఇంకెప్పుడూ తన జీవితంలోకి రానివ్వను అని చెప్తాడు. అయితే ఈ తంతు జరగడానికి ముందే ఈ సీరియల్లో కొత్త హీరోయిన్ కూడా ఎంతో ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ మొదలయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక మీదట పల్లవి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరి పల్లవి నిజంగానే ఈ సీరియల్ నుంచి తప్పకుండా లేకపోతే కొత్తగా వచ్చిన హీరోయిన్ ని అడ్రస్ లేకుండా పంపిస్తుందా అన్నది ఇంకొన్ని ఎపిసోడ్లు పోతే తెలిసే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో అన్నది కాస్త సస్పెన్స్ గా మారింది.