Best IP69 Rating Mobiles : యూజర్స్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ లేటెస్ట్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్క్రీన్, కెమెరా, బ్యాటరీతో పాటు ప్రాసెసర్, డిస్ ప్లే వంటి వాటిలో బెస్ట్ ఫీచర్స్ ను అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు IP69 రేటెడ్ మొబైల్స్ కు డిమాండ్ పెరుగుతుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా వస్తున్న ఈ మొబైల్స్ నీటిలో పడినా, షవర్ కింద ఉంచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఐపీ రేటెడ్ 69తో ఎన్నో బెస్ట్ మొబైల్స్ వచ్చేశాయి. అసలు వాటి ధరలు ఎలా ఉన్నాయి? వాటి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఈ మధ్యకాలంలో ఐపీ69 రేటెడ్ బెస్ట్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. అందులో వన్ ప్లస్ నుంచి పోకో వరకు బెస్ట్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Poco X7 Pro, రియల్ మీ 14 ప్రో, వన్ ప్లస్ 13, ఒప్పో రెనో 13, ఒప్పో ఫైండ్ X8 ఉన్నాయి.
Poco X7 Pro –
పోకో ఎక్స్ 7 ప్రో (Poco X7 Pro) మొబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇందులో 6.6 అంగుళాలు స్క్రీన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియా టెక్ డైమన్ సిటీ 8400 చిప్ సెట్, ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే హైపర్ ఓఎస్ 2 ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. 50Mp ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. 90W చార్జింగ్ కు సపోర్ట్ చేసే 6550mah బ్యాటరీ ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ధర రూ.27,999.
Realme 14 Pro Plus –
1.5K రిజల్యూషన్, స్లిమ్ బెజెల్స్‌తో క్వాడ్ కర్వ్ డిజైన్ కలిగి ఉంటుంది. Snapdragon 7s Gen 3 చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్, 6,000mAh బ్యాటరీ, “టైటాన్ బ్యాటరీ” ఈ మెుబైల్ లో ఉన్నాయి. ఇక ఐపీ69 రేటింగ్ తో వచ్చేసింది. ఈ మెుబైల్ ధర రూ. 29,999
OnePlus 13 –
వన్ ప్లస్ 13లో 6.82 అంగుళాల LTPO QHD + డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits గరిష్ట బ్రైట్నెస్, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉన్నాయి. 50MP LYT-808 ప్రైమరీ షూటర్, 50MP టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000mAh బ్యాటరీ ఉన్నాయి.
Oppo Reno 13 Features –
Oppo Reno 13 మెుబైల్ 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 8350 ప్రాసెసర్, 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ColorOS 15తో టాప్ లో ఉన్న Android 15 ఆపరేటింగ్ సిస్టమ్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5600mAh బ్యాటరీ, 12GB RAM + 256GB స్టోరేజ్ తో వచ్చేసింది.
Oppo Find X8 –
ఒప్పో ఫైండ్ X 8 మోడల్లో స్టాండర్డ్ ట్రిపుల్ కమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 50 మెగా పిక్సల్ టెలిఫొటో, 50 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్, 32 మెగా పిక్స్ల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15తో నడుస్తుంది.