IRCTC Tickets Booking: రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్ కొనుగోలు చేయాలి. సాధారణంగా టికెట్ల కొనుగోలు అనేది ఆన్ లైన్ ద్వారా లేదంటే రైల్వే స్టేషన్ లోని కౌంటర్ల ద్వారా తీసుకుంటారు. జనరల్ టికెట్లు కావాలంటే అప్పటికప్పుడు తీసుకుంటారు. బెర్తులు కావాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే, భారతీయ రైల్వే సంస్థ టికెట్ల బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. ఫోన్ కాల్ తో రైల్వే టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ కాల్ తో టికెట్లు బుక్ చేయడంతో పాటు పేమెంట్స్ కూడా నేరుగా చేసే అవకాశం ఉంటుంది. ముందుగా వాయిస్ కమాండ్ తో టికెట్లు బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
వాయిస్ కమాండ్ తో టికెట్లు బుక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!
⦿IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
⦿ ఆ తర్వాత AskDISHA2.0 ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿కింది భాగంలో కుడి వైపున వాయిస్ బటన్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత ‘I Want To Book a Ticket’ అని వాయిస్ కమాండ్ ఇవ్వాలి.
⦿ ఆ తర్వాత మీరు ఏ స్టేషన్ నుంచి బోర్డింగ్ కావాలి అనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు చెప్పాలి.
⦿ ఆ తర్వాత ఏ స్టేషన్ లో దిగాలనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు చెప్పాలి.
⦿ ఏ రోజు ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఏ క్లాస్ లో సీటు కావాలో చెప్పవచ్చు.
⦿ అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకోవచ్చు.
⦿పేమెంట్స్ ను కూడా నేరుగా వాయిస్ తోనే చేసేయ్యొచ్చు.
ఫోన్ కాల్ తో టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!
ఫోన్ కాల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు రైల్వేశాఖ 0755-3934141, 0755-6610661, 0755-4090600 నెంబర్లను అందుబాటులో ఉంచింది. వీటికి కాల్ చేసి కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ కాల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడమే కాదు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ టికెట్ వెయిటింగ్ లిస్టు, కరెంట్ స్టేటస్, కన్ఫర్మేషన్ అవుతుందా? లేదా? అనే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. అయితే, ఫోన్ కాల్ ద్వారా టికెట్ బుకింగ్ అనేది కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుందనే టాక్ ఉంది. ఫోన్ కాల్ తో టికెట్లు బుక్ చేసుకోవడం కంటే వాయిస్ కమాండ్ తో టికెట్లు బుక్ చేసుకోవడం చాలా సులభం అంటున్నారు. సో, ఇకపై మీరు కూడా ఫోన్ కాల్ తో లేదంటే, వాయిస్ కమాండ్ తో ఈజీగా టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు పూర్తి వివరాలకు కావాలంటే భారతీయ రైల్వే సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ IRCTCలోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోండి. హ్యాపీగా ట్రైన్ జర్నీ చేయండి.
Read Also: డబ్బులు లేకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఇండియన్ రైల్వే సూపర్ సర్వీస్ గురించి మీకు తెలుసా?